ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెండేళ్ల బాబుకు తీవ్ర అనారోగ్యం.. ఆయాపై అనుమానంతో ఇంట్లో ఏర్పాటు చేసిన సీసీటీవీ ఫుటేజీని చెక్‌ చేసిన తల్లిదండ్రులకు..

ABN, First Publish Date - 2022-06-15T17:42:40+05:30

ఆ భార్యాభర్తలిద్దరూ ప్రభుత్వ ఉద్యోగులు.. ఇంట్లో ఉండే వీలు లేకపోవడంతో తమ రెండేళ్ల బాబును చూసుకునేందుకు ఒక ఆయాను పెట్టుకున్నారు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆ భార్యాభర్తలిద్దరూ ప్రభుత్వ ఉద్యోగులు.. ఇంట్లో ఉండే వీలు లేకపోవడంతో తమ రెండేళ్ల బాబును చూసుకునేందుకు ఒక ఆయాను పెట్టుకున్నారు.. ఆమెకు తమ బాబును అప్పగించి వారు డ్యూటీకి వెళ్లిపోయారు.. అయితే కొద్ది రోజులుగా ఆ బాలుడు బలహీనంగా మారి అనారోగ్యానికి గురయ్యాడు.. ప్రతి విషయానికి భయపడుతున్నాడు.. దీంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు ఇంట్లో అమర్చిన సీసీటీవీ ఫుటేజ్ చూడగా అసలు విషయం బయటపడింది.. ఆయా చేతిలో ఆ చిన్నారి నరకయాతన అనుభవించాడు.. అభం శుభం తెలియని చిన్నారితో ఆ ఆయా కర్కశంగా ప్రవర్తించింది. 


ఇది కూడా చదవండి..

వీళ్లు ముగ్గురూ ప్రాణ స్నేహితులే.. అందులో ఇద్దరు కలిసి ఒకరిని చంపేశారు.. అసలు కారణమేంటని పోలీసులు ఆరా తీస్తే..


మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్‌కు చెందిన ముఖేష్ విశ్వకర్మ, సోనాలి దంపతులకు రెండేళ్ల కొడుకు ఉన్నాడు. ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులు కావడంతో తమ రెండేళ్ల బాబు మాన్విక్‌ను చూసుకునేందుకు రజనీ అనే మహిళను ఆయాగా పెట్టుకున్నారు. అయితే ఈ నెల 10వ తేదీన మాన్విక్ అస్వస్థతకు గురయ్యాడు. మాన్విక్‌ను పరీక్షించిన వైద్యులు బలహీనంగా ఉన్నాడని తేల్చారు. తమ బాబు ప్రతిదానికి భయపడుతున్నట్టు కూడా ఆ దంపతులు గుర్తించారు. తాము లేనపుడు ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు ఇంట్లో అమర్చిన సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. అప్పుడు రజినీ కర్కశత్వం బయటపడింది. మాన్విక్‌తో రజినీ ప్రవర్తన చూసి తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. 


రజనీ తరచూ మాన్విక్‌ను జుట్టు పట్టుకుని లాగి కడుపులో కొట్టేది. మాన్విక్ వీపుపై కొట్టడం, చెంప మీద కొట్టడం వంటివి చేసేది. ఒక్కోసారి మాన్విక్ గొంతు కూడా పట్టుకుని భయపెట్టేది. మాన్విక్ కోసం తెచ్చిన పాలు, పండ్లు తానే తీసుకునేది. మాన్విక్‌ను రోజంతా ఆకలితోనే ఉంచేది. అన్నం తినకపోయినా, పాలు తాగకపోయినా రజినీ ఆ బాలుడిని కొట్టేది. రజనీ ప్రవర్తనను సీసీటీవీ ఫుటేజ్‌లో చూసిన విశ్వకర్మ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సాక్ష్యంగా ఆ సీసీటీవీ ఫుటేజ్ కూడా అందించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రజినీని అదుపులోకి తీసుకున్నారు. 

Updated Date - 2022-06-15T17:42:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising