ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వరల్డ్ రికార్డు సృష్టించిన చెన్నై అబ్బాయి.. కేవలం 14 సెకన్లలోనే..

ABN, First Publish Date - 2022-03-21T00:39:39+05:30

రూబిక్స్ క్యూబ్‌ను సాల్వ్ చేయడం అంటే మాటలు కాదు. ఎంతో ఏకాగ్రత అవసరం. ఈ పజిల్‌ను పరిష్కరించలేక చాలా మంది మధ్యలోనే చేతులెత్తేస్తారు. కానీ కేవలం సెకన్లలో అది కూడా సైకిల్ తొక్కతూ సాల్వ్ చేసి వ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: రూబిక్స్ క్యూబ్‌ను సాల్వ్ చేయడం అంటే మాటలు కాదు. ఎంతో ఏకాగ్రత అవసరం. ఈ పజిల్‌ను పరిష్కరించలేక చాలా మంది మధ్యలోనే చేతులెత్తేస్తారు. కానీ కేవలం సెకన్లలో అది కూడా సైకిల్ తొక్కతూ సాల్వ్ చేసి వరల్డ్ రికార్డు సృష్టించాడు. ప్రస్తుతం అతడికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


చెన్నైకి చెందిన జయదర్శన్ వెంకటేషన్ అనే చిన్నోడు అద్భుతం చేసి చూపాడు. క్లిష్టమైన రూబిక్స్ క్యూబ్‌ను సైకిల్ తొక్కుతూ కేవలం 14.32సెకన్లలో సాల్వ్ చేశాడు. దీంతో అతడి పేరు గిన్నీస్ వరల్డ్ రికార్డు‌లోకి ఎక్కింది. జయదర్శన్ సైకిల్ తొక్కతూ పజిల్ పరిష్కరించిన వీడియోను గిన్నీస్ వరల్డ్ రికార్డు ప్రతినిధులు.. అధికారిక ఇన్‌స్టాగ్రాం అకౌంట్‌లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో నెటింట వైరల్‌గా మారింది. అది చూసి నెటిజన్లు.. జయదర్శన్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా.. ఈ రికార్డు సాధించడం కోసం ఈ చిన్నోడు దాదాపు 2ఏళ్లపాటు శ్రమించినట్టు తెలుస్తోంది. 






Updated Date - 2022-03-21T00:39:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising