ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కుమార్తె జహారా షాపింగ్ నుంచి లేటుగా వస్తున్నదని తెలుసుకున్న షాజహాన్ కట్టించిన ఆ నిర్మాణం... ఇప్పుడు ఎలా ఉన్నదంటే...

ABN, First Publish Date - 2022-07-18T14:53:14+05:30

ఢిల్లీలోని చాందినీ చౌక్ భారతదేశంలోనే కాకుండా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీలోని చాందినీ చౌక్ భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రసిద్ధి చెందింది. ఇది దేశంలోని పురాతన మార్కెట్లలో ఒకటి. ఇక్కడి వీధుల్లో షాపింగ్ చేస్తే వచ్చే మజానే వేరంటారు. అత్యంత చౌకైన, అత్యంత ఖరీదైన వస్తువులను ఇక్కడ కొనుగోలు చేయవచ్చు. దుస్తులు, బూట్లు, చెప్పులు లాంటి అన్ని రకాల వస్తువులు... నగల నుండి ఆహారపానీయాల వరకు ప్రతిదీ ఇక్కడ దొరుకుతుంది. చాలామంది దూరప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి షాపింగ్ చేస్తుంటారు. ఢిల్లీ పర్యటనకు వచ్చినవారంతా చాందినీ చౌక్‌ను తప్పక సందర్శిస్తారు. ఇప్పుడు చాందినీ చౌక్ చరిత్ర గురించి తెలుసుకుందాం. మొఘల్ చక్రవర్తి షాజహాన్ హయాంలో చాందినీ చౌక్ నిర్మితమయ్యింది. అతను దానిని తన కుమార్తె షాజాదీ జహారా కోసం నిర్మించారు. జహారాకు షాపింగ్ అంటే చాలా ఇష్టం. 




ఆమె షాపింగ్‌ కోసం దూర ప్రాంతాలకు వెళ్లేది. దీంతో ఆమెకు చాలా సమయం పట్టేదట. దీనిని గమనించిన షాజహాన్ అన్ని రకాల వస్తువులు లభించే మార్కెట్‌ను దగ్గరలో ఏర్పాటు చేయాలని భావించి దీనిని నిర్మించారని చెబుతారు. చాందినీ చౌక్ నిర్మాణం 1650 సంవత్సరంలో ప్రారంభమైంది. దీనిని చతురస్రాకారంలో నిర్మించారు. యమునా నదిపై పడిన చంద్రుని వెలుగు ఈ నిర్మాణంపై పడిన కారణంగానే దీనికి చాందినీ చౌక్ అనే పేరు వచ్చిందని చెబుతారు. ఇక్కడ వెండిని ఎక్కువగా విక్రయించడం వలన కూడా దీనికి చాందినీ చౌక్ అనే పేరు వచ్చిందని కూడా చెబుతారు. విదేశాల నుంచి కూడా వ్యాపారులు ఇక్కడికి వస్తుంటారు. దాదాపు 1.3 కిలోమీటర్లు విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ మార్కెట్‌లో అప్పట్లో దాదాపు 1500 దుకాణాలు ఉండేవి. నేడు చాందినీ చౌక్ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. మీరు ఎప్పుడైనా ఢిల్లీకి వచ్చినప్పుడు చాందినీ చౌక్ చూడటం అస్సలు మరచిపోకండి. 

Updated Date - 2022-07-18T14:53:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising