ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చాణక్య నీతి: వ్యాపారులకు, పండితులకు పరిమితులు లేవని చాణక్య ఎందుకు చెప్పారంటే..

ABN, First Publish Date - 2022-03-06T12:19:17+05:30

చాణక్య నీతి: వ్యాపారులకు, పండితులకు పరిమితులు లేవని చాణక్య ఎందుకు చెప్పారంటే..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చాణక్య నీతి ప్రకారం మనిషి ఎప్పటికీ ధైర్యాన్ని కోల్పోకూడదు. చాణక్యుడు రచించిన చాణక్య నీతి.. మనిషికి చీకటిలో కాంతిని చూపించడానికి ఉపకరిస్తుంది. ఆచార్య చాణక్యుడు భారతదేశంలోని ఉత్తమ విద్వాంసులలో ఒకరు. చాణక్య నీతిలోని కొన్ని విలువైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం

అతిరూపేణ వై సీతా అతిగర్వేణః రావణః ।

అతిదానాబ్దలిర్బర్దో హ్యతి సర్వత్ర వర్జయేత్ ।।

చాణక్య నీతిలోని ఈ ఈ శ్లోకం  అర్థం ఏమిటంటే.. దేనిలోనూ అతి పనికిరాదు. అంటే.. మితిమీరిన అందం వల్ల సీత అపహరణకు గురైంది. మితిమీరిన అహంకారం వల్ల రావణుడు అంతం అయ్యాడు. మితిమీరిన దానానికి బలి చక్రవర్తి అంతం అయ్యాడు. అందుకే ఏదైనా మితిమీరకుండా చూసుకోవాలి. జీవితంలో దేనినీ అతిగా చేయకూడదు. 


కొల్తీభర్: సమర్థనం కి దూరం వ్యాపారినాం।

కో విదేశః సువిద్యానాం కః పరః ప్రియవాదినామ్ ।

చాణక్య నీతిలోని ఈ శ్లోకానికి గల అర్థం ఏమిటంటే.. కొందరికి అవధులు అంటూ ఉండవు. అంటే వారికి పరిమితుల పట్టింపు లేదు. వ్యాపారవేత్తకు తాను చేసే వ్యాపారినికి సంబంధించి స్థల పరిమితులు ఉండవు. పరిమితులు పెట్టుకుంటే ప్రయోజనం ఉండదు. అలాగే పండితులకు కూడా పరిధులు లేవు. జ్ఞానం అందుకునేందు ప్రతీవారూ ఉత్సాహం చూపిస్తారు. అందుచేత పండితుడు పరిమితులు పెట్టుకోకుండా జ్ఞానాన్ని అందరికీ పంచాలి.  మధురంగా మాట్లాడేవారు అందరికీ ప్రియమైనవారిగా మారుతారు. వారికి శత్రువులు ఉండరు. శత్రువులు లేని వాడికి ఎటువంటి లక్ష్యం అయినా కష్టం కాదు.

Updated Date - 2022-03-06T12:19:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising