ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చాణక్య నీతి: పురుషుడు ఈ మూడు విషయాల్లో భయపడి, వెనుకాడకూడదు.. లేదంటే జరిగేది ఇదే!

ABN, First Publish Date - 2022-02-16T12:42:47+05:30

ఆచార్య చాణక్య నాడు తెలిపిన నీతి సూత్రాలు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆచార్య చాణక్య నాడు తెలిపిన నీతి సూత్రాలు నేటికీ ఆచరణ యోగ్యంగా ఉన్నాయి. పురుషుల విషయంలో ఆచార్య చాణక్య కొన్ని ప్రత్యేక జీవన విధానాలు తెలియజేశారు. పురుషుడు ఈ మూడు పనులు చేయడానికి భయపఢి, వెనుకాడకూడదని ఆచార్య చాణక్య తెలిపారు. ఈ విషయాల్లో భయపడితే ఆనందకర జీవితానికి దూరమవుతారని హెచ్చరించారు. చాణక్య నీతిలో తెలిపిన వివరాల ప్రకారం కొందరు ఎదుటివారితో మాట్లాడేందుకు తటపటాయిస్తారు. అటువంటివారు మున్ముందు చాలా సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. ముఖ్యంగా పురుషులు ఈ మూడు సందర్భాల్లో ఎప్పుడూ భయపడకూడదని ఆచార్య చాణక్య సూచించారు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. పురుషుడు ఏ అమ్మాయినైనా ప్రేమిస్తే దానిని ఆమె ముందు వ్యక్తం చేసేందుకు సిగ్గుపడకూడదు. ఆదే సందర్భంలో ఆమె మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తుంటే.. మీరు కూడా ఆమెను ప్రేమిస్తున్నట్లయితే, వెంటనే ఆమెకు మీ అభిప్రాయం ఆమెకు చెప్పాలని ఆచార్య చాణక్య సూచించారు. ఇటువంటి విషయంలో భయంతో తటపటాయిస్తే మీ ప్రేమ ఫలించదు. 


ఇదేవిధంగా భార్యతో ఏకాంతంగా ఉన్నప్పుడు పురుషుడు సిగ్గుపడకూడదు. ఈ విధంగా మీరు సిగ్గు పడితే మీ భార్య మిమ్మల్ని తగిన స్థాయిలో గౌరవించదని ఆచార్య చాణక్య తెలిపారు. మీరు మీ భార్య నుండి ప్రేమను పొందేందుకు ఎప్పుడూ సిగ్గుపడకూడదని చాణక్య సూచించారు. మీరు ప్రేమను అడగడానికి లేదా స్వీకరించడానికి సిగ్గుపడితే భార్యాభర్తల సంబంధంలో దూరం ఏర్పడుతుంది. ఇటువంటి సందర్భాల్లో మీ భార్య మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. పురుషుడు వివాహిత స్త్రీతో ప్రేమలో పడకూడదు. ఇలా చేస్తే జీవితంలో చాలా సమస్యలు ఎదురవుతాయని చాణక్య హెచ్చరించారు. ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో తెలిపిన వివరాల ప్రకారం చూస్తే.. పురుషుడు దుఃఖం, పేదరికం, కఠినమైన పరీక్షలు ఎదురైనప్పుడు భయపడకూడదు. ఎందుకంటే ఇటువంటి విషయాల్లో ఎంతగా భయపడతామో పరిస్థితులు అంత కఠినంగా మారుతాయి. అందుకే అలాంటి పరిస్థితుల్లో పురుషుడు దృఢంగా ఉంటూ, పరిస్థితులను చక్కదిద్దుకునేందుకు ప్రయత్నించాలి. పురుషులు మానసికంగా ఎంత బలహీనంగా ఉన్నప్పటికీ దానిని వ్యక్తం చేయకుండా, సమస్యలకు పరిష్కారాన్ని వెదకాలి. ఇలా ఉన్నప్పుడు మీపై ఆధారపడిన భార్య మీపై మరింత నమ్మకాన్ని పెంచుకుంటుంది. మీరు ఆమె ముందు ప్రతిదానికీ కలత చెందితే, ఆమె మనోబలం దెబ్బతింటుంది. అప్పుడు ఆమె ద్వారా మీరు ఇబ్బందిని ఎదుర్కోవలసి వస్తుందని ఆచార్య చాణక్య సూచించారు. 




Updated Date - 2022-02-16T12:42:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising