ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చాణక్య నీతి: ఎవరు ఎంత ప్రయత్నించినా దీనిని మీ నుంచి ఎవరూ లాక్కోలేరు!

ABN, First Publish Date - 2022-04-03T12:01:21+05:30

రాజనీతి శాస్త్రానికి గురువు అయిన విష్ణు గుప్తుడు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజనీతి శాస్త్రానికి గురువు అయిన విష్ణు గుప్తుడు అంటే ఆచార్య చాణక్యుడి మాటలు నేటికీ ఎంతో ఆదరణ పొందుతున్నాయి. విజయవంతమైన జీవితాన్ని గడపడానికి చాణక్య విధానాలు అనుసరించడం చాలా ముఖ్యం. అతని ఆలోచనలు కఠినంగా అనిపించినా, దానిలో జీవిత సత్యం కనిపిస్తుంది. చాణక్య సలహాలు.. జీవితంలో మనకు ఎదురయ్యే ప్రతి పరీక్షలోనూ సహాయపడతాయి. వాటిలో ఒక అంశాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఎవరు ఎంత ప్రయత్నించినా మీ నుండి ఎవరూ దోచుకోలేని అమూల్యమైన అంశాన్ని ఆచార్య చాణక్య తెలిపారు. ‘ఎవరూ దోచుకోలేని, దొంగిలించలేని ఆస్తి విద్య’ అని ఆచార్య చాణక్య తెలిపారు. ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో విద్యను ఎవరూ దొంగిలించలేరని తెలిపారు. విద్య అనేది ఖచ్చితంగా కూడబెట్టుకోగల ఆస్తి అని, ఎవరైనా దొంగిలిస్తారనే భయం అవసరం లేదని ఆచార్య చాణక్య తెలిపారు. మనిషి జీవనోపాధి కోసం చదువుకుంటాడని, తన కాళ్లపై తాను నిలబడటమే కాకుండా, విద్య ద్వారా తనకు తానుగా అన్ని సుఖాలను కూడగట్టుకుంటాడని చాణక్య తెలిపారు. మీ విషయ పరిజ్ఞానాన్ని చూసి చాలా మంది అసూయపడవచ్చు. కానీ వారు మీ దగ్గర నుంచి దానిని దొంగిలించలేరు. ఎన్ని లక్షల ప్రయత్నాలు చేసినా వారి ప్రయత్నిం వృథా అవుతుంది. విద్యను ఎంత ఖర్చు చేసినా ఎప్పటికీ తరిగిపోదని ఆచార్య చాణక్య తెలిపారు. 

Updated Date - 2022-04-03T12:01:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising