ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చాణక్యనీతి: వ్యాపారం ఇలా ప్రారంభిస్తే వెనకడుగు ప్రసక్తే ఉండదు!

ABN, First Publish Date - 2022-05-29T13:03:46+05:30

మీరు ఉద్యోగం చేస్తే మీ కుటుంబాన్ని మాత్రమే...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మీరు ఉద్యోగం చేస్తే మీ కుటుంబాన్ని మాత్రమే పోషించగలరు. అయితే మీరు నిజంగా జీవితంలో ఆనందం, శ్రేయస్సు కోరుకుంటే వ్యాపారం చేయాలి. వ్యాపారం కోసం మీరు మీ డబ్బును పెట్టుబడిగా పెడతారు. ఇటువంటి సందర్భంలో ఒకరి మాటలు వినేముందు లేదా ఒకరిని అనుసరించేముందు పదిసార్లు ఆలోచించాలి. వ్యాపారాన్ని ప్రారంభించడం, దానిని అభివృద్ధి చేయడం గురించి ఆచార్య చాణక్య పేర్కొన్న విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఎవరైనా ఏ పనినైనా ప్రారంభించాలనుకుంటే దాని గురించి పూర్తి సమాచారం తీసుకోవాలని ఆచార్య చాణక్య తెలిపారు. ఆ రంగం గురించి తెలుసుకోవాలంటే అధ్యయనం చేయాలి. ఎందుకంటే విషయ పరిజ్ఞానం సరైన మార్గాన్ని చూపుతుంది.


ఆ వ్యాపారంలోని ప్రయోజనాలు, అప్రయోజనాలు తెలుసుకున్న తర్వాత మాత్రమే దానిలో ముందుకు సాగడానికి మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి. పూర్తి సన్నద్ధతతో మీ పనిని ప్రారంభించండి. మీరు ఏదైనా పనిని ప్రారంభించినప్పుడు, మొదట్లో మీ పనిని హీనపరిచే మాటలను తోటివారి నుంచి వినవలసి వస్తుందని.. ఇది మీ నమ్మకాన్ని బలహీనపరుస్తుందని ఆచార్య తెలిపారు. మీపై మీరు నమ్మకం పెంచుకోవాలి. సరైన దిశలో కష్టపడి పనిచేయాలి. మీరు కొత్తగా ఏదైనా పనిని ప్రారంభించాలని ఆలోచిస్తున్నప్పుడు, దాని గురించి ఇతరులకు కూడా తెలియజేయవద్దు. మీ ప్లాన్‌ను ఎవరితోనూ పంచుకోవద్దు. అలాచేస్తే మీరు చేయాలనుకుంటున్న పనిలో ఆటంకాలు ఎదురుకావచ్చు. మీరంటే అసూయపడే వ్యక్తులు మీ పనిని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తారు. ఏదైనా పనిని ప్రారంభించినప్పుడు, దానిని మధ్యలో ఆపవద్దు. తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుని సానుకూలతతో ముందుకు సాగండి. ఇటువంటి సందర్భాల్లో చాలాసార్లు రిస్క్ తీసుకోవాల్సి వస్తుందని ఆచార్య తెలిపారు. ఇందుకోసం మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి. అలాగే రెండవ ఎంపికను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంచండి.  కటువుగా మాట్లాడేవారు ఎప్పటికీ వ్యాపారం చేయలేరు. మధురంగా మాట్లాడితేనే జనాన్ని ఆకట్టుకోవచ్చని ఆచార్య చాణక్య తెలిపారు. 


Updated Date - 2022-05-29T13:03:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising