ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

SBI: రాజస్థాన్ ఎస్బీఐ బ్రాంచ్ నుంచి నాణేలు మాయం.. రంగంలోకి దిగిన సీబీఐ.. కారణమేంటంటే..

ABN, First Publish Date - 2022-08-20T21:36:55+05:30

బంగారం కాదు.. కరెన్సీ కట్టలు కాదు.. రాజస్థాన్‌ (Rajasthan)లోని కరౌలీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బంగారం కాదు.. కరెన్సీ కట్టలు కాదు.. రాజస్థాన్‌ (Rajasthan)లోని కరౌలీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) బ్రాంచ్ నుంచి నాణేలు మాయమయ్యాయి.. అవి ఎలా పోయాయో తెలుసుకునేందుకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) అధికారులు రంగంలోకి దిగారు.. ఎందుకంటే మాయమైన నాణేల విలువ ఏకంగా రూ.11 కోట్లు. అందుకే ఆ బ్రాంచ్‌కు సంబంధించిన 25 ప్రాంతాల్లో సీబీఐ అధికారులు శుక్రవారం సోదాలు నిర్వహించారు.


ఇది కూడా చదవండి..

Independence day: స్వాతంత్య్ర దినోత్సవానికి ముందు బ్రిటిష్ అధికారికి చెంపదెబ్బ.. కారణమేంటో చెప్పిన 108 ఏళ్ల వృద్ధుడు


ఎస్బీఐ కరౌలీ బ్రాంచ్ 2021 ఆగస్టులో జరిపిన అంతర్గత ఆడిట్‌లో నగదు నిల్వలో వ్యత్యాసం ఉన్నట్లు బయటపడింది. దీంతో డబ్బు లెక్కింపు చేపట్టాలని నిర్ణయించింది. ఆ బాధ్యతను ఓ ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించింది. లెక్కింపు పూర్తయిన తర్వాత రూ.11 విలువైన నాణేలు మాయం అయినట్టు తేలింది. రాజస్థాన్ హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ ఈ ఏడాది ఏప్రిల్ 13న కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించింది. ఢిల్లీ, జైపూర్, దౌసా, కరౌలి, సవాయ్ మాధోపూర్, అల్వార్, ఉదయ్‌పూర్, భిల్వారా మొదలైన 25 ప్రాంతాల్లో ఉన్న 15 మంది మాజీ బ్యాంకు అధికారులు, ఇతర ప్రాంగణాల్లో సీబీఐ సోదాలు నిర్వహించింది.

Updated Date - 2022-08-20T21:36:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising