ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Cat saves toddler: చిన్నారిని పెద్ద ప్రమాదం నుంచి కాపాడిన పిల్లి.. వీడియో వైరల్!

ABN, First Publish Date - 2022-08-13T01:58:43+05:30

చిన్న పిల్లలకు, పెంపుడు జంతువులకు మధ్య అనుబంధం చాలా గాఢంగా ఉంటుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిన్న పిల్లలకు, పెంపుడు జంతువులకు మధ్య అనుబంధం చాలా గాఢంగా ఉంటుంది. వారి మధ్య షరతులు లేని స్వచ్ఛమైన ప్రేమ ఉంటుంది. తాజాగా వైరల్ అవుతున్న ఓ వీడియో ఈ అంశాన్ని మరోసారి గుర్తు చేస్తోంది. ఈ పాత వీడియో ప్రస్తుతం బాగా వైరల్ అవుతోంది. ఇప్పటికి 3 లక్షలకు పైగా వ్యూస్ దక్కించుకుంది. పై అంతస్థులో ఉన్న ఓ గదిలో ఓ చిన్నారి ఆడుకుంటున్నాడు. ఆ గదిలోనే ఉన్న సోఫాలో పెంపుడు పిల్లి కూడా ఉంది. 


ఆడుకుంటూ ఆ చిన్నారి మెట్ల వైపు వెళ్లడాన్ని పిల్లి గమనించింది. వెంటనే సోఫా నుంచి కిందకు దూకి ఆ చిన్నారి మెట్ల వైపు వెళ్లకుండా (Cat saves toddler) అడ్డుకుంది. లేకపోతే ఆ చిన్నారి మెట్లపై నుంచి పడి భారీ ప్రమాదానికి గురయ్యేవాడు. ఈ ఘటన ఆ గదిలో అమర్చిన సీసీటీవీ కెమేరాలో రికార్డు అయింది. ఆ వీడియోను How Things Work అనే ట్విటర్ హ్యాండిల్‌లో షేర్ చేశారు. ఆ వీడియో బాగా వైరల్ అవుతోంది. పెంపుడు జంతువుల విశ్వాసం గురించి నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 


Updated Date - 2022-08-13T01:58:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising