ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Casagrand Foreign Trip: వావ్.. ఆ సంస్థ ఉద్యోగులు భలే లక్కీ.. ఫారిన్ ట్రిప్‌లు, నగదు బహుమతులు..

ABN, First Publish Date - 2022-11-30T18:50:34+05:30

ఉద్యోగులను సంతోషంగా ఉంచేందుకు సంస్థల యాజమాన్యాలు రకరకాల పనులు చేస్తుంటాయి. ఇంక్రిమెంట్లు, బోనస్‌లు ఇచ్చి వారిని సంతోషపెడుతుంటాయి. అయితే దక్షిణ భారతదేశంలోని ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ కాసాగ్రాండ్ (Casagrand) ప్రతి ఏటా తన ఉద్యోగులకు బంపరాఫర్‌లు ప్రకటిస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉద్యోగులను సంతోషంగా ఉంచేందుకు సంస్థల యాజమాన్యాలు రకరకాల పనులు చేస్తుంటాయి. ఇంక్రిమెంట్లు, బోనస్‌లు ఇచ్చి వారిని సంతోషపెడుతుంటాయి. అయితే దక్షిణ భారతదేశంలోని ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ కాసాగ్రాండ్ (Casagrand) ప్రతి ఏటా తన ఉద్యోగులకు బంపరాఫర్‌లు ప్రకటిస్తోంది. 2013లో ప్రారంభమైన ఈ సంస్థ అద్భుతమైన లాభాలను కళ్ల జూస్తోంది. గతేడాది ఈ సంస్థ రూ.2,903 కోట్ల విలువైన విక్రయాలు జరిపింది. దీంతో ఆ కంపెనీ తన ఉద్యోగులను యూరప్ ట్రిప్ తీసుకెళ్తోంది.

సంస్థలో పని చేస్తున్న 700 మంది ఉద్యోగులను స్విట్జర్లాండ్‌కు ఏడు రోజుల పర్యటనకు తీసుకువెళుతోంది. అంతే కాదు ఉద్యోగులకు రెండు నెలల జీతాన్ని కూడా బోనస్‌గా ఇస్తోంది. గతేడాది కూడా కాసాగ్రాండ్ యాజమాన్యం 700 మంది ఉద్యోగులను దుబాయ్‌కి, 900 మందిని అబుదాబికి పంపించింది. అంతకు ముందు కూడా లండన్, సింగపూర్, థాయ్‌లాండ్, మలేషియా వంటి దేశాలకు తన ఉద్యోగులను విహార యాత్రలకు తీసుకెళ్లింది. 2013లో సంస్థ కార్యకలాపాలు ప్రారంభమైన తర్వాత ఒక్క ఏడాది తప్ప మిగిలిన అన్ని సంవత్సరాలు ఈ టూర్‌లు జరిగాయి.

Updated Date - 2022-11-30T19:42:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising