Shocking Video: టోల్‌గేట్‌ను బలంగా ఢీకొట్టిని కారు.. బయటకు ఎగిరిపడ్డ డ్రైవర్.. ఆ వీడియో చూస్తే..
ABN, First Publish Date - 2022-10-16T20:32:59+05:30
దేశంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఎన్ని ప్రమాదాలు జరిగి ఎంత మంది ప్రాణాలు కోల్పోతున్నా
దేశంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఎన్ని ప్రమాదాలు జరిగి ఎంత మంది ప్రాణాలు కోల్పోతున్నా కొందరు డ్రైవింగ్ సమయంలో నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు. రోడ్డు భద్రతా నియమాలను పట్టించుకోకుండా అతి వేగంగా రోడ్లపై దూసుకుపోతుంటారు. తాజాగా ఒక వ్యక్తి అత్యంత వేగంగా కారును నడిపి టోల్‌గేట్‌ను బలంగా ఢీకొట్టాడు. ఆ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఆ వీడియో ప్రకారం.. ఓ కారు వేగంగా వచ్చి టోల్ బూత్ ముందున్న డివైడర్‌ను చాలా బలంగా ఢీ కొట్టింది. ఆ ధాటికి కారు పైకి ఎగిరి పడింది. డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి కారు లోపలి నుంచి రోడ్డుపై పడ్డాడు. కారు నుంచి మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదం చాలా తీవ్రంగా ఉంది. ఈ ప్రమాదంలో డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డాడా లేక చనిపోయాడా అనేది కచ్చితంగా తెలియలేదు. ఈ వీడియో చూసిన చాలా మంది నెటిజన్లు షాక్‌కు గురవుతున్నారు.
Updated Date - 2022-10-16T20:32:59+05:30 IST