ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్యాప్సికమ్‌లో కనిపించే ఉబ్బెత్తుల సీక్రెట్ ఇదే..

ABN, First Publish Date - 2022-05-19T17:02:14+05:30

క్యాప్సికమ్ ఆకృతి ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

క్యాప్సికమ్ ఆకృతి ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. దీనిని బెల్ పెప్పర్ కూడా అంటారు. క్యాప్సికమ్ బొటానికల్ పేరు క్యాప్సికమ్ ఎనమ్. ఇది సోలాన్సి కుటుంబానికి చెందినది. ఈ కూరగాయ దక్షిణ అమెరికా ఖండానికి చెందినది. బ్రిటిష్ వారు భారతదేశానికి వచ్చినప్పుడు, వారు దాని విత్తనాలను కూడా భారతదేశానికి తీసుకువచ్చారు. ఆ సమయంలో సిమ్లా మన దేశానికి వేసవి రాజధానిగా ఉండేది. బ్రిటిష్ వారు దీనిని సిమ్లా మరియు చుట్టుపక్కల కొండలలో పెంచారు. 


కాగా క్యాప్సికమ్‌లోని ఉబ్బెత్తు భాగాల గురించి ప్రస్తావనకు వస్తే.. నాలుగు ఉబ్బెత్తు భాగాలను కలిగి ఉన్న క్యాప్సికమ్‌ను ఆడ క్యాప్సికమ్ అని, మూడు ఉబ్బెత్తు భాగాలను కలిగిన క్యాప్సికమ్ మగ క్యాప్సికమ్ అని అంటారు. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా రివర్‌సైడ్ పోమాలజిస్ట్ డేవిడ్ కార్ప్ దీని గురించి పరిశోధించారు. క్యాప్సికమ్‌ను మగ, ఆడ అని విభజించడం తప్పుడు భావన అని అన్నారు.  ఆ చెట్ల పూల నుండి క్యాప్సికమ్‌లు పెరుగుతాయని  తెలిపారు. మగ, ఆడ భాగాలంటూ ఉండవని చెప్పారు. ఇది విత్తన ఆధారితమైనదని, అలా ఏర్పడటానికి వివిధ పరిస్థితులు కారణమన్నారు. క్యాప్సికమ్ పెరుగుదలను అనుసరించి దానిలో ఎన్ని భాగాలు ఏర్పడతాయనేది ఆధారపడి ఉంటుందన్నారు.  


Updated Date - 2022-05-19T17:02:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising