ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ దేశంలో ప్రభుత్వ అనుమతి లేకుండా ల్యాప్‌టాప్‌ కొనలేరు.. మరిన్ని నిషేధాలు కూడా..

ABN, First Publish Date - 2022-06-25T17:27:45+05:30

ఉత్తర కొరియా పేరు చెప్పగానే కిమ్‌ జోంగ్‌...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉత్తర కొరియా పేరు చెప్పగానే కిమ్‌ జోంగ్‌ ఉన్ రూపం గుర్తుకు వస్తుంది. కిమ్‌ జోంగ్‌ వ్యవహార శైలి చాలా విచిత్రంగా ఉంటుంది. కిమ్‌ జోంగ్‌ ఉన్ పాలనలో దక్షిణ కొరియాలో అనేక విచిత్రమైన నియమాలు, నిబంధనలు అమలవుతున్నాయి. నియంతృత్వానికి కిమ్ మారుపేరని అంటారు. కిమ్ అనుమతి లేకుండా ఉత్తర కొరియాలో ఆకు కూడా కదలదనే మాట వినిపిస్తుంటుంది. ఇప్పటి వరకు మరే దేశంలోనూ ఇలాంటి రూల్స్ లేవని అంటారు. వాటిలో కొన్నింటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దక్షిణ కొరియాలో ప్రభుత్వ అనుమతి లేకుండా ఎవరూ ల్యాప్‌టాప్ కొనుగోలు చేయలేరు. కిమ్ ప్రభుత్వ అనుమతి లేకుండా ల్యాప్‌టాప్‌లను కొనుగోలు చేయడంపై నిషేధం ఉంది. ఉత్తర కొరియాలో ల్యాప్‌టాప్‌లు చాలా ఖరీదైనవి. ఈ నిబంధనలు ఉల్లంఘించిన వారికి కఠినమైన శిక్షలు విధిస్తుంటారు. 


ఉత్తర కొరియా ప్రజలు బ్లూ జీన్స్ ధరించలేరు. వీటిని ప్రభుత్వం నిషేధించింది. ఈ రంగు అమెరికా పెట్టుబడిదారీ విధానాన్ని సూచిస్తుందని కిమ్ అభిప్రాయపడ్డారు. ఉత్తర కొరియా ప్రజలు దక్షిణ కొరియా వస్తువులను ఉపయోగించరు. అంతే కాకుండా ఫ్యాషన్ సినిమా, సంగీతానికి దూరంగా ఉండాలనే నిబంధన కూడా ఉంది. ఎవరైనా దక్షిణ కొరియా వస్తువులను ఉపయోగిస్తే, వారికి శిక్ష విధిస్తారు. ఇక్కడ హెయిర్ స్టైల్ విషయంలో కూడా నియమం ఉంది. స్థానికులంతా ప్రభుత్వం సూచించిన విధంగా హెయిర్‌స్టైల్‌ చేయించుకోవాలి.  పెళ్లికాని యువతులు తమ జుట్టును పొట్టిగా ఉంచుకోవాలి. ఉత్తర కొరియన్లు 28 వెబ్‌సైట్‌లను మాత్రమే బ్రౌజ్ చేసేందుకు అవకాశం ఉంది. ఉత్తర కొరియాలో కేవలం 4 టీవీ ఛానెళ్లు మాత్రమే ఉన్నాయి. ఇవి ప్రభుత్వ యాజమాన్యంలో ఉన్నాయి.



Updated Date - 2022-06-25T17:27:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising