Viral Video: లైవ్లో వార్తలు చదువుతుండగా అడ్డు వచ్చిన ఈగ.. ఆ యాంకర్ ఏం చేసిందో చూడండి..
ABN, First Publish Date - 2022-09-05T02:11:20+05:30
లక్షలాది మంది చూస్తుండగా లైవ్లో వార్తలు చదవడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు..
లక్షలాది మంది చూస్తుండగా లైవ్లో వార్తలు చదవడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు.. రకరకాల సమస్యలు ఎదురవుతుంటాయి.. అయినా వాటిని పట్టించుకోకుండా, తమ భావోద్వేగాలను ప్రదర్శించకుండా ప్రశాంత వదనంతో వార్తలు చదవాల్సి ఉంటుంది.. తాజాగా ఓ యాంకర్ లైవ్లో వార్తలు చదువుతుండగా చిన్న సమస్య ఎదురైంది. అయినా ఆమె సమయస్ఫూర్తితో వ్యవహరించి బులిటెన్ కంప్లీట్ చేసింది. ఆ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ (Viral Video) అవుతోంది.
కెనడా(Canada)కు చెందిన గ్లోబల్ న్యూస్ యాంకర్ ఫరా నాజర్(Farah Nasser) లైవ్ బులిటెన్ చదువుతోంది. ఆ సమయంలో అకస్మాత్తుగా ఒక ఈగ ఎగురుతూ వచ్చి ఆమె నోటిలోకి ప్రవేశించింది. ఆ సమయంలో వార్తలు చదవడం ఆపి బ్రేక్ తీసుకోవడానికి కుదరదు. దీంతో ఫరా నాజర్ ఆ ఈగను మింగేసి (Female Anchor Swallowed a Fly) వార్తలు చదవడం కొనసాగించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
Updated Date - 2022-09-05T02:11:20+05:30 IST