ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

5 స్టార్ హోటల్ నుంచి గర్లఫ్రెండ్‌తో కలిసి పరారైన వ్యాపారవేత్త.. ఇంతకీ అతను అక్కడ ఏం చేశాడంటే?..

ABN, First Publish Date - 2022-02-06T05:38:59+05:30

ఆమె ఒక కంపెనీ డైరెక్టర్. ఆమె భర్త ఒక బిజినెస్‌మెన్. ఒకరోజు ఆమెకు ఎవరో తన ఆధార్ కార్డు వేరే రాష్ట్రంలో ఉపయోగించారని తెలిసింది. అదెలా సాధ్యమని ఆమె ఆరా తీయగా.. తీగ లాగితే డొంక కదిలింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆమె ఒక కంపెనీ డైరెక్టర్. ఆమె భర్త ఒక బిజినెస్‌మెన్. ఒకరోజు ఆమెకు ఎవరో తన ఆధార్ కార్డు వేరే రాష్ట్రంలో ఉపయోగించారని తెలిసింది. అదెలా సాధ్యమని ఆమె ఆరా తీయగా.. తీగ లాగితే డొంక కదిలింది. ఆమె భర్త తన గర్లఫ్రెండ్‌తో ఒక 5 స్టార్ హోటల్‌లో ఉన్నట్లు తెలిసింది. 


వివరాల్లోకి వెళితే.. గుజరాత్‌కు చెందిన అనిల్ జైన్(పేరు మార్చబడినది) ఒక పెద్ద బిజెనెస్‌మేన్. ఆయన భార్య లలిత జైన్(పేరు మార్చబడినది) ఒక బడా కంపెనీ డైరెక్టర్. భార్యాభర్తల మధ్య ఎప్పుడూ గొడవలు జరుగుతూ ఉండేవి. అనిల్ బిజినెస్ పనిమీద అని తరుచూ గుజరాత్ నుంచి బయటకు వెళ్లేవాడు. దీంతో లలిత ఎప్పుడూ తన భర్తకు వివాహేతర సంబంధాలున్నాయని అనుమానించేది.


ఒకరోజు అనిల్‌కు తెలీకుండా అతని కారులో లలిత జిపిఎస్ ట్రాకర్ పెట్టించింది. మరుసటి రోజు అనిల్ బెంగుళూరులో బిజినెస్ మీటింగ్ ఉందని చెప్పి బయలుదేరాడు. కానీ అతను బెంగుళూరుకు బదులు పూణె వెళ్లాడు. అది కూడా తన గర్లఫ్రెండ్‌తో. రెండో రోజు లలిత జిపిఎస్ ట్రాకర్ చూస్తే అనిల్ పూణెలోని ఒక 5 స్టార్ హోటల్‌లో ఉన్నట్లు తేలింది. కానీ లలిత తన అనుమానం నిర్ధారణ చేసుకునేందుకు ఆ హోటల్‌కు ఫోన్ చేసి అనిల్ జైన్ గురించి అడిగింది. అప్పుడు ఆ హోటల్ సిబ్బంది అనిల్ తన భార్యతో అక్కడికి వచ్చినట్లు సమాచారమిచ్చారు.  దీంతో లలిత ఒక్కసారిగా షాక్‌కు గురైంది. అనిల్ భార్య ఎవరు అని ఆమె ప్రశ్నించగా.. బిజినెస్ మేప్ అనిల్ హోటల్‌లో గది తీసుకునేందుకు తన భార్య ఆధార్ కార్డు ఉపయోగించారని వారు చెప్పారు.


ఈ విషయం విని లలిత తన భర్త, అతని గర్ల్‌ఫ్రెండ్‌లపై చీటింగ్ కేసు పెట్టింది. తన ఆధార్ కార్డ్ దొంగలించి ఉపయోగిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొంది. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి విచారణ మొదలు పెట్టారు. కానీ అనిల్‌కు దీని గురించి ముందుగానే తెలిసిపోయింది. అతను పోలీసులు రాకముందే తన గర్లఫ్రెండ్‌తో పరారయ్యాడు. పోలీసులు ప్రస్తుతం అనిల్, అతని గర్ల్ ఫ్రెండ్ కోసం గాలిస్తున్నారు.

Updated Date - 2022-02-06T05:38:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising