ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జీవితాన్ని సానుకూలంగా మార్చివేసే బుద్ధుని బోధ!

ABN, First Publish Date - 2022-05-22T15:15:43+05:30

బుద్ధుని ఉపన్యాసాలు వినడానికి చాలా మంది రోజూ వచ్చేవారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బుద్ధుని ఉపన్యాసాలు వినడానికి చాలా మంది రోజూ వచ్చేవారు. ఉపన్యాసం వినేవారిలో బుద్ధుని మాటలను ఎంతో శ్రద్ధగా వినే ఒక వ్యక్తి కూడా ఉన్నాడు. ఆ వ్యక్తి బుద్ధుని మాటలు మంచివని భావించేవాడు. కానీ అతని జీవితంలో ఎటువంటి మార్పు లేదు. ఒక రోజు బుద్ధుడు ఇలా అన్నాడు.. ఒక వ్యక్తి మీపైన కోపగిస్తే తనకు తానే హాని చేసుకుంటాడు. అయితే అప్పుడు మీరు కూడా కోపంతో కోపంతో ప్రతిస్పందిస్తే, మీకే ఎక్కువ హాని కలుగుతుంది. ఈ మాట విన్న ఆ వ్యక్తికి కోపం వచ్చి.. 'ఇన్ని రోజులుగా మీ మాటలు వింటున్నా, నా మనసులో మార్పు రాలేదు, అలాంటప్పుడు మీ ఉపన్యాసాలు విని ఏం లాభం?' అని అన్నాడు.

బుద్ధుడు ఆ వ్యక్తితో.. 'నువ్వు ఎక్కడ నివసిస్తున్నావు?'

ఆ వ్యక్తి 'నేను శ్రావస్తిలో నివసిస్తున్నాను' అని సమాధానమిచ్చాడు.

బుద్ధుడు మళ్లీ అడిగాడు, 'ఇక్కడి నుండి శ్రావస్తికి ఎంత దూరం? ఇక్కడకు వచ్చేందుకు ఎంత సమయం పడుతుంది?'


ఆ వ్యక్తి దూరాన్ని చెప్పాడు. అలాగే  ప్రయాణించడానికి ఎంత సమయం పడుతుందో కూడా చెప్పాడు. దీని తర్వాత బుద్ధుడు మళ్లీ 'ఇక్కడికి ఎలా వచ్చి వెళ్తావు?'

ఆ వ్యక్తి, 'నేను ఏదో ఒక వాహనం మీద వస్తాను' అని చెప్పాడు.

బుద్ధుడు.. 'ఒక విషయం చెప్పు, ఇంట్లోనే కూర్చొని ఇక్కడికి చేరుకోగలవా?' అని అడిగాడు. అతను.. కూర్చుని ఎలా చేరుకోగలం? ఇందుకోసం వాహనం వాడాలి లేదా నడవాలి' అని చెప్పాడు. బుద్ధుడు ఇలా  అన్నాడు.. ఏదో ఒక రవాణా సాధనంతోనే  ఇక్కడకు చేరుకోగలం. మీరు వచ్చిన లక్ష్యం శాంతి. అక్కడికి ఎప్పుడు చేరుకుంటానని ఆలోచిస్తున్నారు. దీనికి సమయం పడుతుంది. మీరు ప్రతిరోజూ సత్సంగం చేస్తే, మీ ఆలోచనల తీరు మారుతుంది. ఏదో ఒక రోజు మీరు మీ లక్ష్యాన్ని చేరుకుంటారు.

Updated Date - 2022-05-22T15:15:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising