ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చిలుక కోసం యువకుడి ప్రాణం బలి.. దారుణంగా చంపేసి ఎవరికీ దొరక్కుండా స్కెచ్.. చివరకు..

ABN, First Publish Date - 2022-04-15T22:20:19+05:30

చిన్న చిన్న విషయాలకే అతిగా స్పందిస్తున్న కొందరు దారుణాలకు పాల్పడుతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిన్న చిన్న విషయాలకే అతిగా స్పందిస్తున్న కొందరు దారుణాలకు పాల్పడుతున్నారు. క్షణికావేశంలో తోటి మనుషుల ప్రాణాలు తీస్తున్నారు. చిలుకను దొంగిలించాడనే కారణంతో ఓ యువకుడిని అతి కిరాతకంగా చంపేసిన ఘటన తాజాగా మధ్యప్రదేశ్‌లో వెలుగులోకి వచ్చింది. పోలీసులకు దొరక్కూడదనే కారణంతో మృతదేహాన్ని మాయం చేశారు. చివరకు పోలీసులకు దొరికిపోయి కటకటాల పాలయ్యారు. 


మధ్యప్రదేశ్‌లోని రైసెన్ జిల్లా రాణిపురా గ్రామానికి చెందిన అమిత్ అనే యువకుడు ఈ నెల 6వ తేదీన అదృశ్యమయ్యాడు. కుటుంబ సభ్యులు ఎంతగా వెతికినా అమిత్ కనిపించలేదు. దాంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని అమిత్ కోసం అన్వేషణ ప్రారంభించారు. ఆ సమయంలో గ్రామ శివారులో అమిత్ మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం హత్య ఎవరు చేసి ఉంటారని దర్యాఫ్తు ప్రారంభించారు. ఈ క్రమంలో గ్రామానికి చెందిన ఓ వ్యక్తి పోలీసులకు కీలక సమాచారం అందించాడు. 


అదే గ్రామానికి చెందిన అజయ్, అనిల్‌పై అనుమానం వ్యక్తం చేశాడు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. తామే అమిత్‌ను చంపినట్టు వారు అంగీకరించారు. తాము ఇంటి వద్ద ఓ చిలుకను పెంచుకుంటున్నామని, దానిని అమిత్ దొంగిలించాడని వారు పోలీసులకు తెలిపారు. ఈ విషయమై వారిద్దరూ అమిత్‌‌తో గొడవపెట్టుకున్నారు. ఆ గొడవలో ఒక పెద్ద రాయి తీసుకొని అమిత్‌ తలపై కొట్టడడంతో తీవ్ర గాయమైంది. తీవ్ర రక్తస్రావం జరగడంతో అమిత్ అక్కడికక్కడే మరణించాడు. ఎవరికి దొరకకుండా ఉండేదుకు అమిత్ మృతదేహానికి రాయిని కట్టి నదిలో విసిరేశారు. 

Updated Date - 2022-04-15T22:20:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising