ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

10 ఏళ్లకుపైగా వేచి చూసినా డాక్టర్ అపాయింట్‌మెంట్ దొరకలేదు.. చివరికి ఈయన ఏం చేశాడో తెలిస్తే..

ABN, First Publish Date - 2022-10-18T03:18:56+05:30

బ్రిటన్‌లో(Britain) ఇటీవల ఓ అసాధారణ ఘటన వెలుగులోకి వచ్చింది. 50 ఏళ్ల వ్యక్తి ఒకరు తన పళ్లు తానే తొలగించుకోవడం ప్రారంభించినట్టు వెల్లడైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: బ్రిటన్‌లో(Britain) ఇటీవల ఓ అసాధారణ ఘటన వెలుగులోకి వచ్చింది. 50 ఏళ్ల వ్యక్తి ఒకరు తన పళ్లు తానే తొలగించుకోవడం ప్రారంభించినట్టు వెల్లడైంది. పంటి నొప్పి భరించలేకే ఆయన ఈ చర్యకు పూనుకున్నారు. పదేళ్లకు పైగా ప్రభుత్వ డెంటిస్ట్(పళ్ల డాక్టర్-Dentist) అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నించి విఫలమైన ఆయన చివరకు తన చికిత్స తానే చేసుకోవడం ప్రారంభించారు.


బ్రిటన్ పౌరులకు ప్రభుత్వం..నేషనల్ హెల్త్ సర్వీసెస్(NHS) పేరిట తక్కువ ధరకే వైద్య సేవలు అందిస్తుంటుంది. ఇక డేవిడ్(David) అనే వ్యక్తి ప్రభుత్వం అందించే వికలాంగ పింఛనుపై ఆధారపడి జీవిస్తుంటారు. ఆర్థికఒడిదుడుకుల కారణంగా ఆయన కొన్ని సందర్భాల్లో కడుపునిండేలా ఆహారం కూడా కొనుక్కోలేని పరిస్థితి. ఇటీవలకాలంలో బ్రిటన్‌లో జీవనవ్యయం విపరీతంగా పెరగడంతో..డేవిడ్ పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. ఇదిలా ఉంటే..ఆయన కొన్నేళ్లుగా పంటి సమస్యలతో బాధపడుతున్నారు. అయితే.. ఎన్‌హెచ్‌ఎస్ డెంటిస్ట్ అపాయింట్‌‌మెంట్ కోసం పలుమార్లు ప్రయత్నించి ఆయన విఫలమయ్యారు. డెంటిస్ట్ అపాయింట్ కోసం సుదీర్ఘకాలం వేచి చూడాల్సి రావడం ఆయనకు ఇబ్బందికరంగా మారింది. ప్రైవేటు వైద్యుల వద్దకు వెళ్లేంత ఆర్థికస్థోమత ఆయనకు లేదు. 


మరో మార్గం లేక ఆయన.. నొప్పి పుడుతున్న పళ్లను తానే స్వయంగా తొలగించేందుకు నిర్ణయించుకున్నారు. ‘‘పన్ను వదులయ్యేంతవరకూ వేచి చూస్తా. ఆ తరువాత దాన్ని చేతితో కదపడం మొదలెడతా.. అలా కొన్ని రోజుల తరువాత.. పన్ను ఊడిపోయే స్థితికి చేరుకుంటుంది. చివరిగా.. నాలుగు బీర్లు తాగి.. నొప్పి తెలీకుండా ఉండేందుకు రెండు ఇబుబ్రూఫెన్ మాత్రలు వేసుకుంటా. ఆపై ప్లైయర్స్‌తో పన్నును పీకేస్తా..తెల్లారేసరికి ఆ ప్రాంతంలో కొద్దిగా రక్తం కారడం మినహా ఇప్పటివరకూ ఇతర సమస్యలేమీ ఎదురుకాలేదు. ఇలా ఎన్నో పళ్లు తొలగించుకున్నా’’ అని ఆయన చెప్పుకొచ్చారు. కాగా.. ఈ ఘటన వెలుగులోకి రావడంతో ఎన్‌హెచ్ఎస్ అధికారులు స్పందించారు. వ్యవస్థలో మార్పులు తెచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించామని చెప్పారు. ఇప్పటికే పరిస్థితి చాలా వరకూ మెరుగుపడిందని చెప్పుకొచ్చారు. వైద్యుల అపాయింట్‌మెంట్ దొరకలేదన్న కారణంగా తొందరపాటు పనులకు పూనుకోవద్దని వారు ప్రజలకు సూచించారు. స్థానిక వైద్యులను సంప్రదించాలని చెప్పారు.   


Updated Date - 2022-10-18T03:18:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising