ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నెలన్నర క్రితం పెళ్లి.. డ్యూటీకి వెళ్లి సాయత్రం తిరిగొచ్చిన భర్త.. భార్య కనిపించకపోవడంతో ఇల్లాంతా వెతికి చూస్తే..

ABN, First Publish Date - 2022-02-20T18:46:14+05:30

అతనికి 45 రోజుల క్రితం వివాహం జరిగింది.. వైవాహిక జీవితం సంతోషంగా సాగిపోతోంది..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అతనికి 45 రోజుల క్రితం వివాహం జరిగింది.. వైవాహిక జీవితం సంతోషంగా సాగిపోతోంది.. ఇటీవల అతను డ్యూటీ నుంచి తిరిగి వచ్చేసరికి ఇంట్లో భార్య కనిపించలేదు.. దీంతో అతను ఊరంతా వెతికాడు.. ఎక్కడా ఆమె జాడ లేదు.. బీరువా తెరిచి చూడగా అందులో బంగారు నగలు, రూ.50 వేల నగదు కనిపించకుండా పోయింది.. దీంతో అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు.. హర్యానాలోని హిసార్‌ జిల్లాలో ఈ ఘటన జరిగింది. 


హిసార్ జిల్లాలోని ఆజాద్ నగర్‌కు చెందిన గోవింద్ అనే వ్యక్తి డిసెంబర్ 22న పాయల్ అనే యువతిని వివాహం చేసుకున్నాడు. 45 రోజుల వరకు ఆమె బాగానే ఉంది. గత శుక్రవారం గోవింద్ డ్యూటీ నుంచి తిరిగి వచ్చేసరికి ఆమె ఇంట్లో కనిపించలేదు. ఊరిలో ఎక్కడా ఆమె జాడ లేదు. బీరువా తెరిచి చూడగా అందులో బంగారు నగలు, రూ.50 వేల నగదు కనిపించకుండా పోయింది. దీంతో అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు.


జిల్లాలో ఈ నెలలోనే ఇలాంటి కేసులు ఐదు నమోదు కావడంతో పోలీసులు అలెర్ట్ అయ్యారు. ఐదు కేసుల్లోనూ వధువులు ఇతర రాష్ట్రాలకు చెందిన వారే. బాధితులందరి వయసూ సరాసరి 40 ఏళ్లు ఉంటోంది. వయసు మళ్లిన పురుషులను టార్గెట్ చేసి, వారిని పెళ్లి చేసుకుని, కొద్ది రోజుల తర్వాత డబ్బు, బంగారంతో మహిళలు పరారవుతున్నారు. దీంతో పోలీసులు అలాంటి వివాహాలపై నిఘా పెట్టారు. 

Updated Date - 2022-02-20T18:46:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising