ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Wedding Video: వామ్మో.. ఈ వధువు ఇలా చేసిందేంటి.. అందరి ముందే వరుడి ముఖంపై..

ABN, First Publish Date - 2022-08-15T21:32:58+05:30

వివాహం.. ప్రతి ఒక్కరి జీవితంలో దీనికి ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. అందుకే ఈ మధ్య యువతి, యువకులు.. తమ పెళ్లిళ్ల కోసం పెద్ద మొత్తంలో ఖర్చు పెడుతున్నారు. వేడుకను సాధ్యమైనంత వరకు అత్యంత మధుర జ్ఝాపకంగా మలుచుకుంటున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: వివాహం.. ప్రతి ఒక్కరి జీవితంలో దీనికి ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. అందుకే ఈ మధ్య యువతి, యువకులు.. తమ పెళ్లిళ్ల కోసం పెద్ద మొత్తంలో ఖర్చు పెడుతున్నారు. వేడుకను సాధ్యమైనంత వరకు అత్యంత మధుర జ్ఝాపకంగా మలుచుకుంటున్నారు. ఈ కోవకే చెందిన నవదంపతులు.. బంధు మిత్రుల మధ్య ఘనంగా పెళ్లి చేసుకున్నారు. అయితే.. చివరకు వధువు ట్విస్ట్ ఇవ్వడంతో వరుడు సహా అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాకయ్యారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కాగా.. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..






యువతి, యువకుడు ఒకరికొకరు ఒకే చెప్పడంతో వారికి పెళ్లి చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. ముహూర్తాన్ని ఫిక్స్ చేసి, బంధు మిత్రులకు తెలియజేశారు. వివాహానికి ఘనంగా ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలోనే తాజాగా కుటుంబ సభ్యులు, బంధువులు, అతిథుల మధ్య ఆ యువతి, యువకుల పెళ్లి ఘనంగా జరిగింది. వివాహానంతరం వధువు, వరుడు మిఠాయిలు తినిపించుకునే సంప్రదాయం స్థానికంగా ఉండటంతో.. తొలుత వరుడికి వధువు మిఠాయి తినిపించింది. ఇష్టం లేనప్పటికీ వధువు(Bride) పెట్టిన మిఠాయిని వరుడు(Groom) బలవంతంగా తిన్నాడు. అనంతరం వరుడు కూడా వధువుకు బలవంతంగా స్వీట్ తినిపించబోయాడు. అది ఆ వధువు నచ్చలేదు. దీంతో అతడి చేయిని నెట్టేసింది. అంతటితో ఆగకుండా అందరిముందే.. వరుడిపై చేయి చేసుకుంది. ముఖంపై లాగిపెట్టి కొట్టింది(Bride Slaps Groom) . వధువు ప్రవర్తన చూసి అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాకయ్యారు. ఈ నేపథ్యంలోనే కొందరు ఆ దృశ్యాలను వీడియో(Viral Wedding Video) తీసి, సోషల్ మీడియా(Social Meida)లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.  


Updated Date - 2022-08-15T21:32:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising