ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వివాహం అయిన వెంటనే వధూవరులు ఎక్కడికి వెళ్లారంటే.. వారు చేసిన పనికి అందరూ ఫిదా!

ABN, First Publish Date - 2022-03-07T19:51:13+05:30

వివాహం అయినా తర్వాత వధూవరులు ఊరేగింపుగా ఇంటికి బయల్దేరుతారు.. లేదా గుడికి వెళ్తారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వివాహం అయినా తర్వాత వధూవరులు ఊరేగింపుగా ఇంటికి బయల్దేరుతారు.. లేదా గుడికి వెళ్తారు. అయితే రాజస్థాన్‌కు చెందిన ఈ నూతన దంపతులు వివాహ వేదిక నుంచి ఊరేగింపుగా నేరుగా పాఠశాలకు వెళ్లారు. ఆ పాఠశాల అభివృద్ధి కోసం తమ వంతుగా ఆర్థిక సహాయం చేశారు. వధూవరులు చేసిన ఈ పని ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచింది. పెళ్లికి వెళ్లిన బంధువులు కూడా తమకు తోచినంత సహాయం చేశారు. 


జైపూర్‌కు సమీపంలోని దౌసి గ్రామానికి చెందిన ప్రహ్లాద్ ప్రజాపత్, మమతకు గత శనివారం వివాహం జరిగింది. వివాహంలో ఏడు అడుగులు వేసిన తర్వాత వారు నేరుగా ఆ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలకు చేరుకున్నారు. ఆ పాఠశాల అభివృద్ధికి తమ వంతుగా ఆర్థిక సహాయం చేశారు. తమకు చదువంటే ఎంతో ఇష్టమని, అయితే ఆర్థిక కష్టాల వల్ల, తల్లిదండ్రుల నిరక్ష్యరాస్యత వల్ల చదువుకోలేకపోయామని చెప్పారు. 


చదువు ప్రాముఖ్యత అందరికీ తెలిసేలా చేయాలనే ఉద్దేశంతోనే వారు వివాహ వేదిక నుంచి నేరుగా పాఠశాలకు చేరుకున్నారు. ప్రహ్లాద్ మూడో తరగతి వరకు మాత్రమే చదువుకోగా.. మమత అసలు చదువుకోలేదు. కాగా, చదువు పట్ల వారికి ఉన్న ఇష్టంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. పెళ్లికి వెళ్లిన బంధు మిత్రులు, గ్రామస్థులు కూడా ఆ పాఠశాల అభివృద్ధికి తమకు చేతనైనంత సహాయం చేశారు. 

Updated Date - 2022-03-07T19:51:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising