ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెళ్లికి కొద్ది గంటల ముందు కనిపించకుండా పోయిన వధువు.. కంగారుగా పక్కిళ్లల్లో ఆరా తీసిన వరుడు.. తిరిగొచ్చాక అసలు నిజం తెలిసి..

ABN, First Publish Date - 2022-01-07T22:20:45+05:30

అమ్మాయి, అబ్బాయి ఒకరికొకరు నచ్చడంతో ఇరు కుటుంబాలకు చెందిన పెద్దలు ముందే అన్నీ మాట్లాడుకున్నారు. నిశ్చితార్థం పూర్తైన మరుసటి రోజే పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకున్నారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: అమ్మాయి, అబ్బాయి ఒకరికొకరు నచ్చడంతో ఇరు కుటుంబాలకు చెందిన పెద్దలు ముందే అన్నీ మాట్లాడుకున్నారు. నిశ్చితార్థం పూర్తైన మరుసటి రోజే పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అందుకు తగ్గట్టుగానే నిశ్చితార్థానికి, పెళ్లికి ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలోనే అంగరంగ వైభవంగా నిశ్చితార్థం జరిపించారు. మరికొద్ది గంటల్లో పెళ్లనగా వధువు అదృశ్యమైంది. విషయం తెలిసి వరుడు పక్కిళ్లలో ఆరా తీశాడు. తిరిగొచ్చాక అసలు నిజాన్ని గుర్తించి షాకయ్యాడు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


రాజస్థాన్‌లోని కోత్వాలి ప్రాంతానికి చెందిన యోగేష్ గోయల్ అనే వ్యక్తి కొన్ని రోజులుగా పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ క్రమంలో అతడికి నరేంద్ర అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. యోగేష్ గోయల్ పెళ్లి ప్రయత్నాల్లో ఉన్నట్టు తెలుసుకుని అతడికి మసురా అనే అమ్మాయి గురించి చెప్పాడు. అమ్మాయి నచ్చితే ఎదురు కట్నం ఇచ్చి, పెళ్లి చేసుకోవాల్సి ఉంటుందని తెలిపాడు. ఈ నేపథ్యంలోనే మసురాను చూసి యోగేష్ గోయల్ ఇష్టపడ్డాడు. యువతి కూడా యోగేష్ గోయల్‌ను ఇష్టపడటంతో నిశ్చితార్థం, పెళ్లి వెంట వెంటనే చేసేయాలని ఇరు కుటుంబాలకు చెందిన పెద్దలు నిర్ణయం తీసుకున్నారు. తాజాగా నిశ్చితార్థం జరిపించారు. 



ముందుగా అనుకున్న విధంగానే నిశ్చితార్థం తర్వాత రూ. 1.20లక్షలను మసురా కుటుంబ సభ్యులకు యోగేష్ గోయల్ అందజేశాడు. మరుసటి రోజు ఉదయం యోగేష్ గోయల్, మసురా పెళ్లి జరగాల్సి ఉండగా.. వధువు అదృశ్యమైంది. దీంతో యోగేష్ చుట్టుపక్కల గాలించాడు. తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత విషయం అర్థమై యోగేష్ గోయల్ షాకయ్యాడు. నగలు, డబ్బుతో మసురా పరారైనట్లు గుర్తించి కంగుతిన్నాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు రిజిస్టర్ చేసుకున్న అధికారులు.. నరేంద్ర, మసురాతోపాటు మరికొందరిని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా మాట్టాడిన అధికారులు.. మసురా అసలు పేరు కిరణ్ మండల్‌గా పేర్కొన్నారు. అంతేకాకుండా నరేంద్ర, కిరణ్ మండల్‌తోపాటు మరికొందరు గ్యాంగ్‌గా ఏర్పడి.. పెళ్లికాని యువకులనే టార్గెట్‌గా చేసుకుని దోపిడీలకు పాల్పడుతున్నట్టు వివరించారు. 




Updated Date - 2022-01-07T22:20:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising