ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: నవవధువు చేసిన పనికి అంతా షాక్.. అందంగా ముస్తాబై మరీ..

ABN, First Publish Date - 2022-04-14T20:40:38+05:30

పెళ్లికి ముందు ఓ వధువు ఆసక్తికరమైన పని చేసింది. అందంగా ముస్తాబై, బంగారు ఆభరణాలను ధరించి మరీ ఆ వధువు అందరినీ ఆశ్చర్యపరిచింది. అందుకు సంబంధించిన దృశ్యాలను కొందరు వీడియో తీసి సో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: పెళ్లికి ముందు ఓ వధువు ఆసక్తికరమైన పని చేసింది. అందంగా ముస్తాబై, బంగారు ఆభరణాలను ధరించి మరీ ఆ వధువు అందరినీ ఆశ్చర్యపరిచింది. అందుకు సంబంధించిన దృశ్యాలను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ప్రస్తుతం ఆ వీడియో, ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారింది. ఈ క్రమంలో స్పందిస్తున్న నెటిజన్లు.. ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. కాగా.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..



సాధారణంగా ఏ అమ్మాయి అయినా పెళ్లి కుదురింది మొదలు.. పెళ్లి పీటలెక్కే వరకు అలంకరణపైనే దృష్టి పెడుతుంది. అందంగా కనిపించేందుకు అన్ని రకాల జాగ్రత్తలూ తీసుకుంటుంది. ఒకటికి రెండు సార్లు అద్దంలో చూసుకుని అంతా ఓకే అనుకున్నాకే పెళ్లి వేదిక వద్దకు బయల్దేరుతుంది. కానీ ఓ వధువు మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరించింది. శరీర సౌష్టవం కోసం జిమ్‌లో చేయాల్సిన కసరత్తులు చేసి అందరినీ ఆశ్చర్యపరింది. ఎరుపు రంగు లెహంగాలో బంగారు ఆభరణాలు ధరించి మరీ.. పుషప్స్ తీసింది. అంతేకాకుండా తన కండలను ప్రదర్శించింది. అనంతరం నవ్వతూ పెళ్లి మండపానికి బయల్దేరింది. ఈ దృశ్యాలను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అదికాస్తా వైరల్‌గా మారింది. 




Updated Date - 2022-04-14T20:40:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising