ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అతడి వయసు 100ఏళ్లు.. 84 సంవత్సరాలుగా ఒకే కంపెనీలో పని చేస్తూ రికార్డు సృష్టించాడు!

ABN, First Publish Date - 2022-04-30T23:34:06+05:30

ప్రైవేటు సంస్థలో పని చేసే ఉద్యోగలు ఎవరైనా 5 లేదా 10 సంవత్సరాలకు మించి ఒకే సంస్థలో పని చేయరు. ప్రమోషన్ కోసమో లేక ఎక్కువ జీతం కోసమో సంస్థలూ మారుతూ ఆర్థికంగా ఎదుగుతారు. కానీ ఓ వ్యక్తి మాత్రం 84ఏళ్లుగా ఒ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: ప్రైవేటు సంస్థలో పని చేసే ఉద్యోగలు ఎవరైనా సాధారణంగా 5 లేదా 10 సంవత్సరాలకు మించి ఒకే సంస్థలో పని చేయరు. ప్రమోషన్ కోసమో లేక ఎక్కువ జీతం కోసమో సంస్థలూ మారుతూ ఆర్థికంగా ఎదుగుతారు. కానీ  ఓ వ్యక్తి మాత్రం 84ఏళ్లుగా ఒకే సంస్థలో పని చేస్తూ  రకార్డు సృష్టించాడు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారిన ఈ అంశానికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


వాల్టర్ ఆర్థమాన్ అనే వ్యక్తి.. బ్రెజిల్‌లోని సాంటా కాటరినా అనే చిన్న పట్టణంలో జన్మించారు. బాగా చదువుకుని జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని భావించిన ఈయన.. చిన్నతనంలో రోజూ కాలినడకనే స్కూల్‌కు వెళ్లేవారు. ఇంటికి తిరిగొచ్చిన తర్వాత స్కూల్‌లో చెప్పిన అంశాలను ప్రాక్టీస్ చేసేవారు. అయితే కుటుంబ ఆర్థిక కారణాల వల్ల 15ఏళ్ల వయసులో పాఠశాలకు ఆయన దూరమయ్యారు. అనంతరం కుటుంబానికి అండగా నిలిచేందుకు ఉద్యోగం చేయాలని భావించారు. స్థానికంగా ఉన్న ఓ టెక్స్‌టైల్ కంపెనీకి వెళ్లి, ఉద్యోగం అడిగారు. వాల్టర్‌కు జర్మనీ భాష రావడంతో.. సేల్స్ పర్సన్‌కు కంపెనీలో ఆయనకు ఉద్యోగం లభించింది. 



ఆ తర్వాత ఆయన అంచలంచెలుగా ఎదిగి పదోన్నతులు పొందారు. ఏప్రిల్ 19న 100వ పుట్టిన రోజును సహోద్యోగులు, కుటుంబ సభ్యుల మధ్య జరుపుకున్నారు. ఈ క్రమంలోనే 2022 జనవరి 6 నాటికి కంపెనీలో ఆయన చేరి 84ఏళ్ల 9 రోజులు గడిచిపోయాయి. దీంతో ఒకే కంపెనీలో అత్యధికాలం పని చేసిన ఉద్యోగిగా వాల్టన్ గుర్తింపు పొందారు. Guinness World Records‌లో స్థానం సంపాదించుకున్నారు. ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ.. తనకు మొదట అవకాశం ఇచ్చిన కంపెనీ‌ని విడిచి వెళ్లాలేక పోయినట్టు చెప్పారు. అంతేకాకుండా తనకు ఇష్టమైన ప్రదేశం కూడా కంపెనీనే అని వెల్లడించారు.  


Updated Date - 2022-04-30T23:34:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising