ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వృద్ధాప్యంలో మెదడు కుంగిపోతుందనుకుంటున్నారా? మీ భావన తప్పో ఒప్పో ఇప్పుడే తెలుసుకోండి!

ABN, First Publish Date - 2022-02-20T13:23:56+05:30

వృద్ధాప్యంలో ఎవరికైనా ఆలోచించే శక్తి, అర్థం చేసుకునే సామర్థ్యం..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వృద్ధాప్యంలో ఎవరికైనా ఆలోచించే శక్తి, అర్థం చేసుకునే సామర్థ్యం క్షీణిస్తుందని అంటారు. ఈ విషయంలో నిజం ఎంత ఉందో తెలుసుకునేందుకు జర్మనీ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేపట్టి, పలు వివరాలు తెలియజేశారు.  వారు అందించిన నివేదిక ప్రకారం 60 ఏళ్ల వయస్సులో మనిషి మెదడు.. 20 ఏళ్ల యువకుని వలె వేగంగా పని చేస్తుంది. ఇదేవిధంగా 40 ఏళ్ల తర్వాత మెదడు పని చేసే వేగం తగ్గిపోతుందని ఇప్పటి వరకు అందరూ విశ్వసిస్తూ వచ్చారు. అయితే కొత్త పరిశోధనలో ఈ వాదనను శాస్త్రవేత్తలు ఖండించారు.  వృద్ధాప్యంలో మెదడు వేగంగా పని చేస్తుందని.. ఎలా  స్పష్టమయ్యిందనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. న్యూ సైంటిస్ట్ యొక్క నివేదిక ప్రకారం  జర్మనీలోని హిండెల్‌బర్గ్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు వయసుకు అనుగుణంగా మెదడు పనితీరు ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవడానికి పరిశోధన సాగించారు. 


ఇందుకోసం 10 లక్షల మందిపై మెదడు తీరుతెన్నులపై పరిశోధన సాగించారు. వీరిలో 10 ఏళ్ల పిల్లల నుంచి 80 ఏళ్ల వృద్ధుల వరకూ ఉన్నారు. పరిశోధనలో పాల్గొన్న వారిచేత సానుకూల-ప్రతికూల పదాలు, ఫోటోలను అమర్చాలని  కోరారు. ఇందుకోసం కొన్ని నిబంధనలు రూపొందించి సమయం కూడా నిర్ణయించారు. ఈ ప్రయోగం సమయంలో ప్రతి ఒక్కరి తీరును నిశితంగా పరిశీలించారు. ఈ పరిశోధనలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాలి. 60 ఏళ్ల వ్యక్తి మెదడు వేగం 20 ఏళ్ల యువకుడి మాదిరిగానే ఉందని తేలింది. అయితే మనిషి మెదడు 60 ఏళ్ల తరువాత నెమ్మదిస్తుందని వెల్లడయ్యింది. మెదడు పని చేసే వేగం.. ఆ వ్యక్తి ఎలాంటి కార్యకలాపాల్లో పాల్గొంటాడనే దానిపై ఆధారపడి ఉంటుందని పరిశోధకురాలు మిస్చా వాన్ చెప్పారు. మనిషి మెదడు వేగం అతని పనితీరుపై ఆధారపడివుంటుంది. ఉదాహరణకు శారీరక శ్రమ చేసేవారిలో కన్నా మానసికంగా పని చేసేవారిలో మెదడు వేగం తక్కువగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. బోస్టన్ కాలేజీకి చెందిన డాక్టర్ జాషువా హార్ట్‌షోర్న్ తెలిపిన వివరాల ప్రకారం వయస్సు పెరిగేకొద్దీ.. మెదడు పరిస్థితుల ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభిస్తుంది. ఉదాహరణకు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఏదైనా అడ్డుగా వస్తే, ఆ వ్యక్తి ఆటోమేటిక్‌గా కారు వేగాన్ని తగ్గిస్తాడు. అదే విధంగా మెదడు కూడా గత నిర్ణయాలను గుర్తుంచుకుంటుంది. వర్తమానంలో దాని ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు. 


Updated Date - 2022-02-20T13:23:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising