ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ధాన్యం దొంగలించాడని బాలుడిని చితకబాది.. గుండు గీసిన యజమానులు..

ABN, First Publish Date - 2022-05-01T07:39:49+05:30

ఆ బాలుడు ధాన్యం దొంగిలించాడని వర్తకులు అనుమానించారు. పోలీసులకు ఫిర్యాదు చేయకుండా తామే శిక్షను అమలు చేశారు.. బాలుడి చేతులు, కాళ్లు కట్టేసి కొట్టారు.. బట్టలు చింపేశారు.. అతడికి గుండు గీశారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆ బాలుడు ధాన్యం దొంగిలించాడని వర్తకులు అనుమానించారు. పోలీసులకు ఫిర్యాదు చేయకుండా తామే శిక్షను అమలు చేశారు.. బాలుడి చేతులు, కాళ్లు కట్టేసి కొట్టారు.. బట్టలు చింపేశారు.. అతడికి గుండు గీశారు. ఆ మొత్తం వ్యవహారాన్ని మొబైల్‌లో వీడియో తీశారు. తాలిబాన్ల తరహాలో శిక్షించిన ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. 


మధ్యప్రదేశ్‌లోని మధుసూదన్ గర్ వ్యవసాయోత్పత్తి మార్కెట్‌లో కూలీగా పనిచేస్తున్న ఒక బాలుడు ధాన్యం దొంగిలించాడని కొందరు వర్తకులు ఆరోపించారు. న్యాయన్యాయాలు విచారణ చేయకుండా ఆ బాలుడిని శిక్షించారు. మార్కెట్‌లోనే అతడి చేతులు, కాళ్లు కట్టేసి కొట్టి, బట్టలు చింపేశారు. అనంతరం గుండు గీశారు. ఆ ఘటన మొత్తాన్ని మొబైల్‌లో వీడియో తీశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ఆ ఘటనపై పోలీసులు చర్యలకు సిద్ధమవుతున్నారు.


ఆ బాలుడు నిజంగా దొంగతనం చేశాడా? లేదా? అని ఆరా తీస్తున్నారు. వీడియో ఆధారంగా ఇప్పటికే నిందితులను గుర్తించారు. మార్కెట్లో అందర్నీ ఆ ఘటన గురించి ప్రశ్నిస్తున్నారు. బాధిత బాలుడికి సంబంధించిన పూర్తి సమాచారం కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు.  



Updated Date - 2022-05-01T07:39:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising