ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘మీ ఫోను నంబరులో 5 ఉందా?.. అయితే ఈ జాబ్‌కు మీరు అనర్హులు’.. వింత కండీషన్ పెట్టిన బాస్!

ABN, First Publish Date - 2022-09-27T15:36:15+05:30

మొబైల్ ఫోన్ నంబరులో ఐదు సంఖ్య ఉన్నవారిని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మొబైల్ ఫోన్ నంబరులో ఐదు సంఖ్య ఉన్నవారిని ఉద్యోగంలోకి తీసుకోబోమని ఒక కంపెనీ బాసు ప్రకటించారు. ఈ నేపధ్యంలో ఈ విచిత్రమైన కండీషన్ విన్న ఉద్యోగార్ధులు సదరు కంపెనీపై మండిపడుతున్నారు. ఈ ఉదంతం చైనాలో చోటుచేసుకుంది. షెంజెన్‌లోని ఒక ఎడ్యుకేషన్ కంపెనీ బాస్ తమ సంస్థలో ఉద్యోగం కోసం వచ్చిన అభ్యర్థులతో.. మీకు ఈ సంస్థలో ఉద్యోగం కావాలంటే మీ మొబైల్ ఫోను నంబర్లను మార్చుకోవాలంటూ కండీషన్ పెట్టాడు.


ఆ బాస్‌కి ఉన్న గుడ్డి నమ్మకం కారణంగానే ఇటువంటి కండీషన్ పెట్టాడనే వాదన వినిపిస్తోంది. ఫోను నంబరులో 5 ఉంటే అది బ్యాడ్ లక్‌కు సంకేతమని ఆ బాస్ భావించాడు. వాట్స్ ఆన్ వైబో తెలిపిన వివరాల ప్రకారం ఈ విచిత్రమైన కండీషన్‌తో స్కిల్స్‌కు గానీ, వర్క్ ఎథిక్స్‌కు గానీ ఎటువంటి సంబంధం లేదు. దీనిపై ఆన్ లైన్ వేదికగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక యూజర్ ఈ 21వ శతాబ్ధంలో కూడా ఇటువంటి మూఢనమ్మకాలేమిటి? మీ కంపెనీలో జ్యోతిష్యులను తీసుకోవడం లేదు కదా అని ప్రశ్నించాడు. 

Updated Date - 2022-09-27T15:36:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising