ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మృత్యు బావిలో బైక్ రైడర్ల విన్యాసాలు.. ఉన్నట్టుండి పట్టుతప్పింది.. అంతే ఊహించని విధంగా...

ABN, First Publish Date - 2022-07-27T14:10:28+05:30

ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహాలో హడలెత్తించే ఉదంతం...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహాలో హడలెత్తించే ఉదంతం చోటుచేసుకుంది. ఇక్కడ ఓ జాతరలో మృత్యుబావి ప్రదర్శనలో ఇద్దరు బైకర్లు ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసినవారి రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి. అమ్రోహా జిల్లా ఉఝరి పట్టణంలో గత కొన్ని రోజులుగా ఉర్స్ జాతర జరుగుతోంది. ఈ జాతరలో 'మృత్యుబావి' ప్రదర్శన కూడా ఏర్పాటు చేశారు. 


ఈ మృత్యు బావిలో స్టంట్ చేస్తున్న సమయంలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో ప్రత్యక్షమయ్యింది. దీనిని చూసినవారంతా షాక్‌కు గురయ్యారు. మృత్యు బావిలో ఇద్దరు బైక్ రైడర్లు విన్యాసాలు చేస్తున్న దృశ్యాలు వీడియోలో కనిపిస్తున్నాయి. ఓ కారు కూడా విన్యాసాలు చేస్తోంది. ఇంతలో బైక్‌ నడిపేవారి బ్యాలెన్స్‌ తప్పింది. వారు బైక్‌తో సహా కిింద పడ్డాడు. ఈ ఆకస్మిక ప్రమాదంతో గందరగోళం నెలకొంది. తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో  ఇద్దరు బైక్ రైడర్స్ గాయపడటంతో వారిని ఆసుపత్రికి తరలించారు. 

Updated Date - 2022-07-27T14:10:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising