ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Bike Stunt Fail: బిజీ రోడ్డుపై బైక్‌తో స్టంట్.. చివరకు ఆ యువకుడి పరిస్థితి ఏమైందంటే.. వైరల్ అవుతున్న వీడియో

ABN, First Publish Date - 2022-08-04T02:16:06+05:30

రోడ్లపై బైక్ స్టంట్లు, రేసింగ్‌లకు పాల్పడే యువకులు ఎన్నో ప్రమాదాలకు కారణమవుతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రోడ్లపై బైక్ స్టంట్లు, రేసింగ్‌లకు పాల్పడే యువకులు ఎన్నో ప్రమాదాలకు కారణమవుతున్నారు. బిజీ రోడ్లపై అత్యంత వేగంగా వెళుతూ ఇతరులను భయాందోళనలకు గురి చేస్తారు. ఇక, చేతిలో స్పోర్ట్స్  బైక్ ఉందంటే వారి వేగానికి అదుపే ఉండదు. ఎంతో మంది యువకులు రోడ్లపై వాహనాలను అడ్డదిడ్డంగా నడిపి తమ ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. ఢిల్లీ పోలీసులు (Delhi police) తాజాగా షేర్ చేసిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా (viral video) మారింది.


ఆ వీడియో ప్రకారం.. ఓ యువకుడు బిజీ రోడ్డుపై బైక్‌ను అడ్డదిడ్డంగా నడుపుతున్నాడు. రోడ్డు మీద వెళ్తున్న అనేక వాహనాలు తప్పించుకుంటూ వేగంగా వెళ్తున్నాడు. ఇంతలో ఓ షాకింగ్ ఘటన జరిగింది. ఆ యువకుడు బ్యాలెన్స్ కోల్పోవడంతో బైక్ (Bike Stunt Fail) అదుపుతప్పింది. దీంతో ఆ యువకుడు బైక్ పై నుంచి ఎగిరి కిందపడ్డాడు. కింద పడిన బైక్ ముందుకు దూసుకు వెళ్లగా ఆ యువకుడు దొర్లుకుంటూ వెళ్లాడు. అయితే హెల్మెట్ పెట్టుకోవడంతో ఆ యువకుడు పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఈ వీడియోను ఢిల్లీ పోలీసులు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

Updated Date - 2022-08-04T02:16:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising