ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆర్థిక కష్టాల వల్ల చదువు మధ్యలోనే ఆపేశాడు.. ఆఫీస్ బాయ్‌గా పనిచేశాడు.. ప్రస్తుతం ఓ టీ స్టాల్ పెట్టి ఎంత పాపులర్ అయ్యాడంటే...

ABN, First Publish Date - 2022-03-07T20:59:46+05:30

అతను ఓ పేద కుటుంబంలో పుట్టాడు.. సివిల్ ఇంజినీరింగ్‌లో జాయిన్ అయి ఆర్థిక కష్టాల వల్ల మూడో సంవత్సరంలో కాలేజీ నుంచి బయటకు వచ్చేశాడు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అతను ఓ పేద కుటుంబంలో పుట్టాడు.. సివిల్ ఇంజినీరింగ్‌లో జాయిన్ అయి ఆర్థిక కష్టాల వల్ల మూడో సంవత్సరంలో కాలేజీ నుంచి బయటకు వచ్చేశాడు.. ఓ కంపెనీలో ఆఫీస్‌బాయ్‌గా చేరాడు.. అయినా ఆర్థిక కష్టాలు తీరకపోవడంతో రోడ్డు పక్కన ఓ టీస్టాల్ పెట్టాడు.. ఆ టీ స్టాల్‌లో టీ ఎంత ఫేమస్సో.. అతను పాడే ర్యాప్ సాంగ్స్ కూడా అంతే ఫేమస్.. దీంతో అతని టీ దుకాణం ముందు జనాలు క్యూలు కడుతున్నారు. 


బీహార్‌లోని పాట్నాకు సమీపంలోని ముషల్లాపూర్‌లో 28 ఏళ్ల మరియో టీ స్టాల్ అంటే తెలియని వారు ఉండరు. సాయంత్రమైతే చాలు విద్యార్థులు, నిరుద్యోగులు, ఇతర కార్మికులు ఆ స్టాల్‌ ముందుకు చేరుతారు. మరియో పాట వింటూ అతనిచ్చే టీని ఆస్వాదిస్తారు. ఒక్కోసారి ఆ రోడ్డులో ట్రాఫిక్ కూడా బ్లాక్ అయిపోతుంటుంది. స్వచ్ఛమైన బీహారీ యాసలో మరియో పాడే ర్యాప్ సాంగ్స్‌ను అక్కడ అందరూ ఇష్టపడతారు. తన జీవితంలో ఎదురైన కష్టాలను అతను హాస్య ధోరణిలో పాడుతుంటాడు. 


తన చుట్టు ఉండే సామాన్య ప్రజల మాటలనే కాగితంపై రాసుకుని వాటితో ర్యాప్ సాంగ్స్ రూపొందిస్తానని మరియో చెబుతున్నాడు. చిన్నప్పటి నుంచి తనకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టమని, ఆ ఇష్టం ఇప్పుడు తనకు ఉపయోగపడుతోందని చెప్పాడు. తన దుకాణానికి రెగ్యులర్‌గా వచ్చే కస్టమర్ల గురించి కూడా మరియో అప్పుడప్పుడు పాటలు పాడుతుంటాడు. దీంతో అతని టీ స్టాల్‌కు విపరీతంగా గిరాకీ పెరిగింది. ఒకప్పుడు ఆఫీస్ బాయ్‌గా రూ.8 వేలు సంపాదించిన మరియో.. ఇప్పుడు నెలకు రూ.80 వేలకు పైగానే సంపాదిస్తున్నాడట. 

Updated Date - 2022-03-07T20:59:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising