ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చాణక్య నీతి: ఈ విషయాలపై దృష్టి పెట్టనివారి జీవితం కకావికలమవుతుంది.. వారిని ఎవరూ కాపాడలేరు!

ABN, First Publish Date - 2022-01-01T13:19:14+05:30

మానవ సంబంధాల విషయంలో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మానవ సంబంధాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చాణక్య నీతి చెబుతోంది. ఆచార్య చాణక్య తెలిపిన వివరాల ప్రకారం తన చుట్టూ ఉన్న వ్యక్తుల భావాలను గుర్తించే సామర్థ్యం లేనివారు లేదా ఎదుటివారి చేష్టలను పట్టించుకోనివారు తమ జీవితంలో అష్టకష్టాలు పడతారని, అటువంటివారిని ఎవరూ కాపాడలేరని ఆచార్య చాణక్య తెలిపారు. 


భారతదేశంలోని అత్యుత్తమ పండితులలో ఒకనిగా చాణక్య గుర్తింపుపొందాడు. చాణక్య తన విషయపరిజ్ఞానం, అనుభవం నుంచి గ్రహించిన విషయాలను తన చాణక్యనీతి పుస్తకంలో రాశారు. ఆచార్య చాణక్య తెలిపిన జీవన విధానాలు నేటికీ ఆచరణయుక్తంగా ఉన్నాయి. చాణక్య నీతి అనేది మనిషి విజయానికి ప్రేరణ కల్పిస్తుంది. మనిషికి జీవితంలో ఎదురయ్యే సుఖదుఃఖాలకు గల కారణాలను వివరిస్తుంది. నేటికీ చాలామంది చాణక్య నీతిని అధ్యయనం చేసి, తమ జీవితాన్ని మెరుగుపరుచుకోవడానికి ఇదే కారణం. మనిషి కొన్ని విషయాల్లో అత్యంత జాగ్రత్తగా ఉండాలని చాణక్య నీతి హెచ్చరిస్తోంది. ఈ విషయాల్లో అప్రమత్తంగా ఉండకపోతే తీవ్ర నష్టం వాటిల్లుతుందని తెలిపింది. 


స్వార్థపరుల విషయంలో..

స్వార్థపరుల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని చాణక్య నీతి చెబుతోంది. స్వార్థపరుడు ఎప్పుడూ స్వలాభం గురించే ఆలోచిస్తాడు. ఇతరుల ప్రయోజనాలను అస్సలు పట్టించుకోడు. తన లాభం గురించే నిరంతరం ఆలోచిస్తుంటాడు. చాణక్యనీతి ప్రకారం స్వార్థపరులకు దూరంగా ఉండాలి. అటువంటివారిని అస్సలు నమ్మకూడదు. ఎందుకంటే అలాంటి వారు అవకాశం దొరికిన వెంటనే తమ ప్రయోజనాల కోసం ఇతరులను మోసం చేసేందుకు సిద్ధంగా ఉంటారు. 

కోపంతో రగిలిపోయేవారికి..

కోపంతో రగిలిపోతున్నవారి విషయంలో, ఆయుధాలను కలిగివున్నవారి విషయంలో ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని చాణక్య నీతి చెబుతుంది. ఇటువంటివారి పట్ల  నిర్లక్ష్యం వహిస్తే ఒక్కోసారి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చాణక్య నీతి హెచ్చరిస్తోంది. 

ముఖం మీద పొగిడేవారి విషయంలో..

ముఖం మీద పొగిడేవారి విషయంలో అప్రమత్తంగా ఉండాలని చాణక్య నీతి చెబుతోంది. అలాంటి వారు తమ ప్రయోజనాల కోసం ఇతరులను మెచ్చుకుంటారు. అందుకే వారికి దూరంగా ఉండాలని చాణక్యనీతి సూచిస్తోంది. చాణక్య నీతి పేర్కొన్న వివరాల ప్రకారం ముఖం మీద పొగిడే వారు మన వెనుక చెడు చేస్తారని, అలాంటి వారిని నమ్మకూడదని, వారు ఎప్పటికీ శ్రేయోభిలాషులు కారని చాణక్యనీతి చెబుతోంది. 

Updated Date - 2022-01-01T13:19:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising