ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: Best Friend ఇచ్చిన సర్‌ప్రైజ్‌కు అథ్లెట్ ఫిదా.. ఇన్‌స్టాలో భావోద్వేగ పోస్ట్.. నెటిజన్ల రియాక్షన్ ఏంటంటే..

ABN, First Publish Date - 2022-06-24T14:34:14+05:30

ఆమె ఒక అథ్లెట్. ఎప్పటిలాగే పరుగు పందెంలో పాల్గొంది. ఈ క్రమంలో తన బెస్ట్ ఫ్రెండ్ ఇచ్చిన సర్‌ప్రైజ్‌కు ఆమె ఫిదా అయింది. మోకాలిపై కూర్చుని.. చేసిన మ్యారేజ్ ప్రపోజల్‌కు ఓకే చెప్పేసింది. అతడిని కౌగిలించుకుని తన ఆమోదాన్ని వ్యక్త పరిచింది. అనంతరం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: ఆమె ఒక అథ్లెట్. ఎప్పటిలాగే పరుగు పందెంలో పాల్గొంది. ఈ క్రమంలో తన బెస్ట్ ఫ్రెండ్ ఇచ్చిన సర్‌ప్రైజ్‌కు ఆమె ఫిదా అయింది. మోకాలిపై కూర్చుని.. చేసిన మ్యారేజ్ ప్రపోజల్‌కు ఓకే చెప్పేసింది. అతడిని కౌగిలించుకుని తన ఆమోదాన్ని వ్యక్త పరిచింది. అనంతరం ఇన్‌స్టాలో భావోద్వేగ ట్వీట్ చేసింది. దీంతో నెటిజన్లు రకరకాలు రియాక్ట్ అవుతున్నారు. కాగా.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..



అమెరికాకు చెందిన మహిళా అథ్లెట్ పేరు మ్యాడిసన్. ఈమెకు క్రిస్టోఫర్ జేమ్స్ అనే బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు. ఇద్దరికి ఒకరిపై మరొకరి చెప్పలేనంత ప్రేమ ఉన్నా.. బయటపడలేదు. ఈ క్రమంలో మ్యాడిసన్ ఎప్పటిలాగే న్యూయార్క్‌లో నిర్వహించిన ఓ పరుగు పందెంలో పాల్గొంది. మిగతా అథ్లెట్‌లలాగే ఆమె కూడా స్టార్టింగ్ లైన్ వద్ద పరుగు మొదలు పెట్టి, ఫినిష్ లైన్‌కు చేరుకుంది. అయితే సరిగ్గా ఫినిష్ లైన్ వద్ద తన స్నేహితుడు జేమ్స్ మోకాలిపై కూర్చోవడం చూపి తొలుత షాకైంది. అనంతరం అతడు పెళ్లి ప్రపోజ్ చేయడంతో.. వెంటనే జేమ్స్‌ను హత్తుకుని ఓకే చెప్పేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఆమె.. ‘ఫినిష్ లైనే నా బెస్ట్ ఫ్రెండ్‌తో మిగిలిన జీవితం జీవించడానికి స్టార్టింగ్ లైన్ అయింది. ఐ లవ్ యూ సో మచ్, క్రిస్టోఫర్ జేమ్స్’ అని రాసుకొచ్చింది. ఆమె పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలు కామెంట్స్ చేస్తున్నారు. ‘అందరి ముందూ.. అలా రొమాంటిక్‌గా మ్యారెజ్ ప్రపోజ్ చేస్తే.. ఏ అమ్మాయి కాదంటుంది’ అని పోస్ట్‌లు పెడుతున్నారు. 




Updated Date - 2022-06-24T14:34:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising