ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Mother Threw Daughter: ఘోరం.. కన్న కూతురిని నాలుగో అంతస్థు నుంచి విసిరేసిన తల్లి..!

ABN, First Publish Date - 2022-08-05T22:28:28+05:30

కన్న బిడ్డకు చిన్న దెబ్బ తగిలితేనే తల్లి తట్టుకోలేదు. బిడ్డకు నయమయ్యే వరకు తల్లడిల్లిపోతుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కన్న బిడ్డకు చిన్న దెబ్బ తగిలితేనే తల్లి తట్టుకోలేదు. బిడ్డకు నయమయ్యే వరకు తల్లడిల్లిపోతుంది. అలాంటిది ఓ తల్లి తన కూతురి పట్ల కర్కశంగా వ్యవహరించింది. ఏకంగా నాలుగో అంతస్థు నుంచి కూతురిని కిందికి విసిరేసి చంపేసింది. బెంగళూరులో (Bengaluru) జరిగిన ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అపార్ట్‌మెంట్ సీసీటీవీ కెమెరాలో నమోదయ్యాయి. ఉత్తర బెంగళూరు ఎస్‌ఆర్‌ నగర్‌లోని అపార్ట్‌మెంట్‌లో ఈ ఘటన గురువారం జరిగింది. 


ఇది కూడా చదవండి..

Haryana Cop With Axe: గొడ్డలితో రెచ్చి పోయిన ట్రాఫిక్ కానిస్టేబుల్.. నడిరోడ్డుపై వీరంగం!


అక్కడి అపార్ట్‌మెంట్‌ నాలుగో అంతస్థులో నివసిస్తున్న ఓ మహిళ తన నాలుగేళ్ల కూతురిని గురువారం బాల్కనీ నుంచి కిందకు విసిరేసింది. అనంతరం తను కూడా అక్కడి నుంచి దూకెయ్యాలనుకుని బాల్కనీ రెయిలింగ్ ఎక్కింది. అయితే అప్పటికే అక్కడకు చేరుకున్న కుటుంబ సభ్యులు ఆమెను కాపాడారు. కాగా, కింద పడగానే ఆ చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. కాగా, ఆ నాలుగేళ్ల బాలిక పుట్టినప్పటి నుంచి మాట్లాడలేదు, వినలేదు. దీంతో ఆ బాలిక తల్లి మానసిక ఒత్తిడికి గురైంది. 


నిందితురాలు ఒక డెంటిస్ట్ (Dentist) కాగా, ఆమె భర్త సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. భర్త ఇచ్చిన ఫిర్యాదుతో నిందితురాలిని అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. మానసిక సమస్యలతో బాధపడుతున్న ఆమెను విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. 

Updated Date - 2022-08-05T22:28:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising