ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చాణక్య నీతి: కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తున్నారా?.. అయితే ఆచార్య చెప్పిన ఈ కీలక విషయాలు తెలుసుకోండి!

ABN, First Publish Date - 2022-02-02T12:24:39+05:30

ఆచార్య చాణక్య తెలిపిన జీవన విధానాలు నేటి యుగంలో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆచార్య చాణక్య తెలిపిన జీవన విధానాలు నేటి యుగంలో కూడా ఉపయోగపడుతున్నాయి. మనిషి తన జీవితంలో ఏవిధంగా విజయం సాధించాలో, విజయవంతమైన వ్యాపారవేత్తగా ఎలా మారాలో లాంటి అనేక విషయాలను ఆచార్య చాణక్య తెలిపారు. మనిషి ఎల్లప్పుడూ సానుకూలంగా ఆలోచించాలని ఆచార్య చాణక్య సూచించారు. ఏదైనా కొత్త పనిని ప్రారంభించే ముందు, మన ఆలోచన స్థిరంగా, సానుకూలంగా ఉండాలి. ప్రతికూల ఆలోచనలతో ఎక్కువ దూరం వెళ్లలేం. 




మీరు ప్రారంభించబోయే పనిని సంపూర్ణంగా చేయలేమని మీకు అనిపించినప్పుడు మరొక ఎంపికను సిద్ధం చేసుకోండి. అప్పుడే మీరు విజయం సాధించగలుగుతారు. కొత్త పనిని ప్రారంభించేటప్పుడు మీ మాటలను అదుపులో పెట్టుకోండి. ఎవరితోనైనా చులకనగా, అమర్యాదగా మాట్లాడితే అది మీ వ్యాపారంలో నష్టానికి దారి తీస్తుంది. చాణక్య నీతి ప్రకారం మీరు కొత్త పనిని ప్రారంభించే ప్రతిసారీ.. దానిని ఎవరికీ తెలియజేయవద్దు. మీ ఆలోచనలను మీలోనే ఉంచుకోండి. చాణక్య నీతి ప్రకారం, వ్యాపారం విజయవంతం కావడానికి కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవలసి వస్తుంది. జీవితంలో రిస్క్‌ తీసుకుంటే తప్ప విజయం సాధించలేరు. ఏదైనా పనిని ప్రారంభించే ముందు, సమయం, స్థలం, ఆ పనిలో భాగస్వాములు.. మీకు ఎవరు సహాయం చేయగలరనే విషయాలను క్షుణ్ణంగా తెలుసుకోండి. 

Updated Date - 2022-02-02T12:24:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising