ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మురుగు నీరు, మూత్రంతో బీరు తయారీ... తాగితే ఎంతో రిలీఫ్ అంటున్న మద్యం ప్రియులు..

ABN, First Publish Date - 2022-05-29T00:42:28+05:30

జిహ్వకో రుచి అన్నట్లు.. ఒక్కొక్కరికి ఒక్కో టేస్ట్ ఉంటుంది. అలాంటి వారి అభిరుచికి తగ్గట్టుగా, తయారీదారులు కూడా కొత్త కొత్త రుచుల్లో ఆహార పదార్థాలు, పానీయాలను అందిస్తున్నారు. ఇక..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జిహ్వకో రుచి అన్నట్లు.. ఒక్కొక్కరికి ఒక్కో టేస్ట్ ఉంటుంది. అలాంటి వారి అభిరుచికి తగ్గట్టుగా, తయారీదారులు కూడా కొత్త కొత్త రుచుల్లో ఆహార పదార్థాలు, పానీయాలను అందిస్తున్నారు. ఇక మద్యం విషయంలో, తయారీ సంస్థలు ఇటీవల నూతన విధానాలను పాటిస్తున్నాయి. ప్రస్తుతం మూత్రంతో బీరు తయారీ విధానం.. ప్రపంచాన్ని కుదిపేస్తోంది. దీనికి మురుగు నీటిని జత చేసి స్వచ్ఛమైన బీరును అందిస్తున్నారు. ఈ బీరు యమ టేస్టీగా ఉందంటూ మద్యం ప్రియులు ఫిదా అవుతున్నారట. ఇంతకీ ఈ బీరు ఎక్కడ తయారు చేస్తున్నారంటే..


మద్యం తయారీలో సింగపూర్‌ వినూత్నంగా ఆలోచిస్తోంది. ఇక్కడి 'న్యూబ్రూ' బీరు.. ప్రస్తుతం ప్రపంచ దేశాల్లో హాట్‌టాపిక్ అవుతోంది. ఈ బీరును మురుగు నీరు, మూత్రంతో తయారు చేయడం వల్లే ఇంత క్రేజ్ ఏర్పడింది. మూత్రం, మురుగు నీటిని శుద్ధి చేసి.. అందులో జర్మన్‌ బార్లీ మాల్ట్‌లు, సుగంధ సిట్రాతో పాటూ దిగుమతి చేసుకున్న ఇతర పదార్థాలను వినియోగిస్తున్నారట. మూత్రం, మురుగును శుద్ధిచేసి తీసిన నీటిని సింగపూర్‌లో 'నీవాటర్‌' అని పిలుస్తారు. ఈ 'న్యూబ్రూ' బీరులో 95శాతం నీవాటర్‌ను ఉపయోగిస్తున్నారట. మాకు ఇలాంటి బీరే కావాలి, వారం అంతా పని చేసిన తర్వాత.. వారాంతంలో ఈ బీరు తాగితే హాయిగా ఉంటుందని చాలా మంది మద్యం ప్రియులు  చెబుతున్నారట.

ఆవు పేడను ఇలా కూడా వాడొచ్చా.. ఇటుకలు తయారు చేసి, లక్షలు సంపాదిస్తున్న లెక్చరర్‌.. ఇంతకీ అది ఎలాగంటే..


సింగపూర్‌ ఇంటర్నేషనల్‌ వాటర్‌ వీక్‌ (ఎస్​ఐడబ్ల్యూడబ్ల్యూ)తో కలిసి నేషనల్ వాటర్ ఏజెన్సీ (పీయూబీ), స్థానిక క్రాఫ్ట్ బీర్ బ్రూవరీ సంస్థలు ఈ బ్రాండ్‌ను ఏప్రిల్ 8న మార్కెట్‌లోని విడుదల చేయనున్నారు. నీటి రీసైక్లింగ్, పునర్వినియోగంపై అవగాహన కల్పించేందుకే ఈ ప్రయోగం చేశామని ఎస్‌డబ్ల్యూడబ్ల్యూ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ర్యాన్‌ యుయెన్‌ తెలిపారు. ప్రపంచ వాప్తంగా చాలా దేశాలు నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి. వాతావరణ పరిస్థితులతో ఈ సమస్య మరింత తీవ్రమయ్యే ముప్పు ఉంది. దీంతో సింగపూర్ తరహాలోనే చాలా దేశాలు ఈ పద్ధతినే ఫాలో అవుతున్నారు. భారత్, చైనా, అమెరికాల్లో కూడా ఇలా నీటిని శుద్ధి చేసే ఏర్పాట్లు ఉన్నాయి.

రసగుల్లల కోసం ఏకంగా ఏడు రైళ్లను ఆపేశారు.. పట్టాలపై టెంట్లు వేసి మరీ క్యూ కట్టిన జనాలు..!



Updated Date - 2022-05-29T00:42:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising