ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మంచాన పడిన వ్యక్తి Covid vaccine తీసుకున్న తర్వాత నడవడం ప్రారంభించాడు...

ABN, First Publish Date - 2022-01-15T16:11:11+05:30

తీవ్ర అనారోగ్యంతో మంచాన పడిన ఓ వ్యక్తి కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత నడవడం ప్రారంభించిన ఘటన...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాంచీ: మంచాన పడిన ఓ వ్యక్తి కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత నడవడం ప్రారంభించిన ఘటన జార్ఖండ్‌ రాష్ట్రంలో వెలుగుచూసింది.జార్ఖండ్‌లోని బొకారో జిల్లాలోని పెటార్వార్ గ్రామానికి చెందిన దులార్‌చంద్ (44) నాలుగేళ్ల క్రితం ప్రమాదానికి గురయ్యాడు. ప్రమాదం తర్వాత అతను మాట కోల్పోయి మంచాన పడ్డాడు.దులార్‌చంద్‌కు జనవరి 4వతేదీన కోవిషీల్డ్ వ్యాక్సిన్ మొదటి డోస్ ఇచ్చారు.టీకా తీసుకున్న తర్వాత దులార్ చంద్ శరీరం శరీరం స్పందించడంతో అతను మంచం మీద నుంచి లేచి తిరగడం ప్రారంభించాడని పెటార్‌వార్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ మెడికల్ ఇన్‌ఛార్జ్ డాక్టర్ అల్బెల్ కెర్కెట్టా చెప్పారు.వ్యాక్సిన్ తీసుకున్న కొన్ని రోజుల తర్వాత దులార్‌చంద్ తన కాళ్లపై నిలబడి నడవడమే కాకుండా తాను కోల్పోయిన తన స్వరాన్ని తిరిగి పొందాడని డాక్టర్ పేర్కొన్నారు.


 ‘‘కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నందుకు ఆనందంగా ఉంది. జనవరి 4న వ్యాక్సిన్ తీసుకున్నప్పటి నుంచి నా కాళ్లలో కదలిక వచ్చింది’’ అని దులార్‌చంద్ తెలిపారు.ఈ ఘటన ఆశ్చర్యం కలిగించినా, అద్భుతం ఏమీ కాదని బొకారో సివిల్‌ సర్జన్‌ డాక్టర్‌ జితేంద్ర కుమార్‌ చెప్పారు. దులార్‌చంద్ వైద్య చరిత్రను విశ్లేషించేందుకు ప్రత్యేక వైద్య బృందాన్ని ఏర్పాటు చేయాలని డాక్టర్ జితేంద్ర కుమార్ ఆదేశించారు.

Updated Date - 2022-01-15T16:11:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising