ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: మావటితో బుల్లి ఏనుగు ఆటలు, అలకలు.. చూస్తే నవ్వాపుకోలేరు.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో!

ABN, First Publish Date - 2022-05-18T22:21:16+05:30

మనుషుల మధ్య అనుబంధాలు ఉంటాయి. మనం పెంచుకునే జంతువులతో కూడా ఆ బంధాల్ని కొనసాగిస్తాం. వాటిని ప్రేమగా చూసుకుంటాం. కొంత మంది తాము పెంచుకున్న కుక్క, పిల్లిని సొంత ఇంట్లో మనుషు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: మనుషుల మధ్య అనుబంధాలు ఉంటాయి. మనం పెంచుకునే జంతువులతో కూడా ఆ బంధాల్ని కొనసాగిస్తాం. వాటిని ప్రేమగా చూసుకుంటాం. కొంత మంది తాము పెంచుకున్న కుక్క, పిల్లిని సొంత ఇంట్లో మనుషుల్లా చూసుకుంటారు. అవి కూడా యజమానులతో సరదాగా ఆడుకుంటూ కాలక్షేపం చేస్తుంటాయి. తాజాగా అలాంటి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సామ్రాట్ గౌడ ట్విట్టర్‌లో గున్న ఏనుగు మావటితో ఆడుకుంటున్న వీడియో పోస్ట్ చేశారు. కంచెకు ఉన్న ఇనుప రాడ్డును చాకచక్యంగా తొలగించిన గున్న ఏనుగు బయటకు వచ్చి నేరుగా పరుపుపై పడుకున్న మావటి దగ్గరకు వెళ్లింది. అది తన బెడ్ అని చెప్తూ.. ఆ పరుపుపై నుంచి మావటిని లేపే ప్రయత్నం చేస్తుంది. మావటి ఎంతకు లేవకపోవడంతో అతడిని పక్కకు నెట్టి ఆ బెడ్‌ను ఆక్రమించుకుంది. మావటి తిరిగి వచ్చి పడుకోవడంతో గున్న ఏనుగు అలక ప్రదర్శించింది. దీంతో మావటి ఏనుగుతో కలిసి పరుపుపై పడుకున్నాడు. ప్రస్తుతం మావటితో గున్న ఏనుగు చేసిన హంగామా నెట్టింట చక్కర్లు కొడుతోంది.




Updated Date - 2022-05-18T22:21:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising