ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral News: 2023లో పొంచి ఉన్న విపత్తులు.. ప్రపంచాన్ని భయపెడుతున్న భవిష్యవాణి!

ABN, First Publish Date - 2022-12-04T12:44:35+05:30

2023 గురించి చాలా మందిలో అప్పుడే ఆలోచనలు మొదలయ్యాయి. కొత్త సంవత్సరం ప్రపంచంలో శాంతిని నింపుతుందా లేక మరింత భయనక పరిస్థితులను చూపిస్తుందా అని సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే 2023ను ఉద్దేశించి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: మరికొద్ది రోజుల్లో క్యాలెండర్ మారబోతోంది. 2022 యావత్ ప్రపంచానికి యుద్ధాన్ని చూపింది. ఉక్రెయిన్-రష్యా మధ్య జరుగుతున్న యుద్ధం.. రావణ కాష్టంలా ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో 2023 గురించి చాలా మందిలో అప్పుడే ఆలోచనలు మొదలయ్యాయి. కొత్త సంవత్సరం ప్రపంచంలో శాంతిని నింపుతుందా లేక మరింత భయనక పరిస్థితులను చూపిస్తుందా అని సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే 2023ను ఉద్దేశించి బాబా వాంగ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి.

బయోవెపెన్స్

ప్రపంచంలో పెద్ద దేశంగా గుర్తింపు పొందిన ఓ దేశం.. ప్రజలపై బయోవెపెన్స్‌ను పరీక్షిస్తుందట. ఫలితంగా చాలా మంది ప్రజలు ప్రాణాలు పోయే అవకాశం ఉందని బాబా వాంగ చెప్పారట.

అణు విస్పోటనం

2023లో న్యూక్లియర్ పవర్ ప్లాంట్ విస్పోటనం చెందుతుందట. దీని వల్ల ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని వెల్లడించారట. కాగా.. ఉక్రెయిన్, రష్యాల మధ్య జరుగుతున్న యుద్ధం ఇంకా తీవ్ర స్థాయికి చేరితే.. న్యూక్లియర్ బాంబుల ప్రయోగం జరుగుతుందనే వార్తలను మనం ఇప్పటికే చూస్తున్నాం. ఈ క్రమంలో బాబా వాంగ చెప్పినట్టుగా ఏ రకంగా అయినా అణు విస్పోటనం తప్పకపోవచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు.

ల్యాబ్ బేబీస్

సహజంగా పిల్లలను కనడం బ్యాన్ అవుతుందట. ల్యాబ్ ద్వారా పిల్లలను కనడానికి ప్రజలు మొగ్గు చూపుతారట. ఎవరు పుట్టాలనే విషయాన్ని ప్రపంచాది నేతలు, డాక్టర్లే నిర్ణయిస్తారట. ఈ పద్ధతిలో తల్లిదండ్రులు తమకు పుట్టబోయే పిల్లల వెంట్రుకలు, కళ్ల కలర్‌లను ముందే నిర్ణయించడానికి వీలవుతుందట.

అంతేకాదు.. భూమి తన కక్ష్యను మార్చుకుంటుందట. దీని వల్ల భూమిపై వాతావరణంలో విపరీతమైన మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందట. అలాగే సౌర తుఫాను చోటు చేసుకోవడం వల్ల ఇప్పటి వరకు అభివృద్ధి చేసుకున్న సాంకేతికత దెబ్బ తింటుందట. ఫలితంగా ప్రజలు ఇబ్బందులకు గురయ్యే అవకాశాలు ఉన్నాయని బాబా వాంగ చెప్పారట.

ఇదిలా ఉంటే.. బాబా వాంగ బల్గేరియాలో జన్మించారు. 12ఏళ్లకే కళ్లను కోల్పోయిన ఈమె.. భవిష్యత్తు గురించి అనేక విషయాలు చెప్పారు. ఆమె చెప్పిన వాటిలో చాలా విషయాలు నిజం అయ్యాయి. 9/11 టెర్రర్ అటాక్ గురించి ఆమె ముందే అంచనా వేశారు. ఈ నేపథ్యంలోనే 2023 గురించి చెప్పిన విషయాలు ప్రస్తుతం ఆందోళన కలిగిస్తున్నాయి.

Updated Date - 2022-12-04T12:47:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising