ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral: అకస్మాత్తుగా బ్యాంక్‌ అకౌంట్లోకి రూ.4.22 కోట్లు డిపాజిట్.. దీంతో ముందూవెనుకా ఆలోచించకుండా..

ABN, First Publish Date - 2022-12-15T20:13:14+05:30

మనది కాని సొమ్ముపై ఆశపడకూడదు. అలా కాదని కట్టుతప్పితే సమస్యల్లో చిక్కుకోక తప్పదు. ఇందుకు మంచి ఉదాహరణ ఆస్ట్రేలియాలో ఇటీవల జరిగిన ఓ ఉదంతం.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: మనది కాని సొమ్ముపై ఆశపడకూడదు. అలా కాదని కట్టుతప్పితే సమస్యల్లో చిక్కుకోక తప్పదు. ఇందుకు మంచి ఉదాహరణ ఆస్ట్రేలియాలో(Australia) ఇటీవల జరిగిన ఓ ఉదంతం. ర్యాపర్‌గా గొప్ప పేరు సంపాదించాలని తపించే అబ్దెల్ ఘాదియాకు(Abdel Ghadia) ఇటీవల బ్యాంక్ అకౌంట్లో పొరపాటున(Accidental money transfer) 7,50,000 డాలర్ల డబ్బు(సుమారు రూ.4.22 కోట్లు) డిపాజిట్ అయ్యింది. ఆ మొత్తాన్ని అతడికి తెలిసిన వారెవరూ ట్రాన్సఫర్ చేయలేదు. మరో జంట.. కొత్త ఇంటిని కొనుగోలు చేసే క్రమంలో పొరపాటున అకౌంట్ నెంబర్ తప్పుగా వేయడంతో అబ్దుల్ అకౌంట్‌లోకి డబ్బు వచ్చి చేరింది. ఇలాంటి సందర్భాల్లో బాధ్యతగా మసులుకుని విషయాన్ని బ్యాంక్ అధికారుల దృష్టికి తీసుకెళ్లాలి. కానీ.. అబ్దుల్ అలాంటిదీ ఏమీ చేయకపోగా.. డబ్బును యథేచ్ఛగా తన అవసరాల కోసం వాడుకున్నాడు. దాదాపు 7 లక్షల డాలర్లు పెట్టి బంగారు ఆభరణాలు, కొత్త దుస్తులు, మేకప్ సామాగ్రి కొనుగోలు చేశాడు. ఇలా షాపింగ్ పేరిట అకౌంట్లోని డబ్బును విచ్చలవిడిగా ఖర్చు చేసేశాడు. చివరకు విషయం పోలీసులకు తెలియడంతో అతడు చివరకు కటకటాల పాలయ్యాడు. బుధవారం అబ్దుల్‌ను స్థానిక కోర్టులో హాజరు పరచగా.. తాను నేరం చేసినట్టు అంగీకరించాడు. దీంతో.. కోర్టు అతడికి 18 నెలల కారాగార శిక్ష విధించింది.

వాస్తవానికి ఇంటి కొనుగోలు నిమిత్తం ఆ జంట ఈ మెయిల్‌లో ఓ వ్యక్తితో సంప్రదింపులు జరిపారు. అయితే..అతడి ఈమెయిల్ అకౌంట్ హ్యాకైనట్టు వారికి అప్పటికి తెలియదు. దీంతో.. వారు హ్యాకర్ చెప్పిన అకౌంట్‌కు డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేశారు. ఆ అకౌంట్ యాదృచ్ఛికంగా అబ్దుల్‌ది కావడంతో కథ ఇలా ఊహించని మలుపు తిరిగింది. అయితే..హ్యాకింగ్ వ్యవహారంలో అబ్దుల్ పాత్ర లేదని పోలీసుల దర్యాప్తులో తేలింది. ‘‘ఓ రోజు తన అకౌంట్లో డబ్బు పడినట్టు అబ్దుల్ చూశాడు.. ఆ తరువాత వెళ్లి షాపింగ్ మొదలెట్టాడు’’ అని ఓ పోలీసు అధికారి వ్యాఖ్యానించారు.

Updated Date - 2022-12-15T20:25:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising