ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అర్ధరాత్రి వంటింట్లో అలికిడి.. దొంగేమో అని పోలీసులకు ఫోన్.. తీరా అక్కడ కనిపించిన సీన్ చూసి షాకైన మహిళ!

ABN, First Publish Date - 2022-03-20T21:22:42+05:30

ఆ మహిళ రోజంతా బిజీగా గడిపింది. రాత్రి వేళ ఇంటికి చేరుకుని.. భోజనం చేసింది. అనంతరం బెడ్‌రూమ్‌లోకి వెళ్లి హాయిగా నిద్రపోయేందుకు సిద్ధమైంది. ఇంతలో వంటింట్లో నుంచి ఏదో శబ్దం వినిపించింది. దీంతో తీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: ఆ మహిళ రోజంతా బిజీగా గడిపింది. రాత్రి వేళ ఇంటికి చేరుకుని.. భోజనం చేసింది. అనంతరం బెడ్‌రూమ్‌లోకి వెళ్లి హాయిగా నిద్రపోయేందుకు సిద్ధమైంది. ఇంతలో వంటింట్లో నుంచి ఏదో శబ్దం వినిపించింది. దీంతో తీవ్ర భయాందోళనలకు గురైన ఆమె.. పోలీసులకు ఫోన్ చేసింది. ఆ తర్వాత వంటింట్లోకి వెళ్లింది. ఈ క్రమంలో అక్కడ కనిపించిన దృశ్యం చూసి షాకైంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..



ఆస్ట్రేలియాలోని సన్‌షైన్ కోస్ట్ ప్రాంతానికి చెందిన ఓ మహిళ ఎప్పటిలాగే డ్యూటీకి వెళ్లింది. రాత్రి వేళ ఇంటికి చేరుకున్న ఆమె భోజనం పూర్తి చేసి, నిద్రపోవడానికి బెడ్‌రూమ్‌కు వెళ్లింది. ఇంతలో వంటింట్లో నుంచి శబ్దాలు వినిపించాయి. గాజు గ్లాసులు కింద పడి పగిలిపోవడంతో ఆమె తీవ్ర భయాందోళనలకు గురైంది. తన ఇంట్లో దొంగ దూరి ఉంటాడని భావించింది. వెంటనే పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించింది. అనంతరం కిచెన్‌లోకి వెళ్లింది. ఈ క్రమంలో ఓ పెద్ద కొండ చిలువ కనపడటంతో ఆమె షాకైంది. ఈ నేపథ్యంలో స్నేక్ రెస్క్యూ టీమ్‌కు ఫోన్ చేసి విషయం చెప్పింది. దీంతో అక్కడకు చేరుకున్న అధికారులు.. ఆ పామును జాగ్రత్తగా ఓ సంచిలో బంధించి.. అటవీ ప్రదేశంలో వదిలేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను అధికారులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అదికాస్తా వైరల్‌గా మారింది. 


వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Updated Date - 2022-03-20T21:22:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising