ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆర్మీ ఉద్యోగి భార్యపై అధికారి అత్యాచార యత్నం.. ఫిర్యాదు చేస్తే ఏమన్నారంటే..

ABN, First Publish Date - 2022-03-18T19:29:00+05:30

అతను ఒక ఆర్మీ ఉద్యోగి.. తన భార్యతో కలిసి క్వార్టర్స్‌లో నివసిస్తున్నాడు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అతను ఒక ఆర్మీ ఉద్యోగి.. తన భార్యతో కలిసి క్వార్టర్స్‌లో నివసిస్తున్నాడు.. ఇటీవల ఆర్మీలో ఉన్నతాధికారి అతని ఇంటికి వెళ్లాడు.. ఎవరూ లేని సమయంలో అతని భార్యపై అత్యాచారానికి ప్రయత్నించాడు.. విషయం తెలుసుకున్న భర్త ఆర్మీ అధికారులకు ఫిర్యాదు చేశాడు.. వారు ఆ ఘటనను తొక్కి పెట్టడానికి చూశారు.. ఆ ఉద్యోగిని వేధించారు.. దీంతో ఆ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 


రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో నివసిస్తున్న ఆర్మీ సైనికుడు ఈ నెల 14వ తేదీన విధుల్లో ఉన్నాడు. ఆ సమయంలో అతని అపార్ట్‌మెంట్‌లోనే ఉన్న అధికారి అతని ఇంటికి వెళ్లాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళపై అత్యాచార యత్నం చేశాడు. ఆమె గట్టిగా కేకలు వేయడంతో భయపడి పారిపోయాడు. భర్త వచ్చిన తర్వాత తనపై జరిగిన అత్యాచార యత్నం గురించి ఆ మహిళ చెప్పింది. దీంతో బాధితురాలి భర్త ఆ ఘటన గురించి పై అధికారులకు ఫిర్యాదు చేశాడు. 


ఆ ఘటనపై విచారణకు ఆదేశించి అత్యాచారానికి పాల్పడిన అధికారిని శిక్షించాల్సిన ఆర్మీ ఉన్నతోద్యోగులు అతడిని కాపాడేందుకు ప్రయత్నించారు. ఫిర్యాదు చేసిన సైనికుడినే వేధింపులకు గురి చేశారు. దీంతో అతను స్థానిక పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని, అతడిని కాపాడేందుకు ప్రయత్నించిన ఆర్మీ అధికారులను విచారిస్తున్నారు.  

Updated Date - 2022-03-18T19:29:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising