ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ వింతజీవికి ప్రమాదం ఎదురైతే ఒక్కసారిగా ‘పాము రెక్కలు’ విప్పుతుంది... జీవితకాలం 10 రోజులే అయినా...

ABN, First Publish Date - 2022-09-28T13:33:42+05:30

బీహార్‌లోని పశ్చిమ చంపారణ్‌లోగల...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీహార్‌లోని పశ్చిమ చంపారణ్‌లోగల వాల్మీకి టైగర్ రిజర్వ్ పరిధిలోని బైరియా కాలా గ్రామంలో ఒక ప్రత్యేక జాతి సీతాకోకచిలుకను శాస్త్రవేత్తలు గుర్తించారు. దాని పేరు అట్లాస్ మాత్. గ్రామంలోనే ఓ ఇంటి దగ్గర వెలుగుతున్న బల్బుపై ఇది కనిపించింది. ఇది అరుదైన సీతాకోక చిలుక. ఇది సాధారణ సీతాకోకచిలుకలకు చాలా భిన్నంగా ఉంటుంది. దాని రెక్కలపై పాము చారల ఆకారం కనిపిస్తుంది. సీతాకోక చిలుకల్లో ఇదొక ప్రత్యేక రకమని స్థానిక అటవీ శాఖ అధికారి సునీల్ కుమార్ తెలిపారు. 


ఆయన తెలిపిన వివరాల ప్రకారం ఈ సీతాకోకచిలుక అట్లాస్ మాత్‌కి చెందిన అరుదైన జాతి. ఇది ముఖ్యంగా అమెరికా, చైనా, ఆఫ్రికా, మలేషియాలో కనిపిస్తుంది. ఈ దేశాలలో దీనిని వేర్వేరు పేర్లతో పిలుస్తారు. దీని ప్రత్యేకత దానికున్న రెక్కలు. ఇది ఒక ప్రత్యేక విధానంలో తనను తాను రక్షించుకుంటుంది. దీనికి ప్రమాదం ఎదురైనప్పుడు అది దాని పాము ఆకారపు రెక్కలను విప్పుతుంది. దీంతో అది తనను తాను రక్షించుకుంటుంది. దీని పరిమాణం అన్ని కీటకాల కన్నా అతిపెద్దది. డబ్ల్యు‌డబ్ల్యు‌ఎఫ్ అధికారి కమలేష్ మౌర్య మాట్లాడుతూ ఈ అరుదైన సీతాకోకచిలుక జీవిత కాలం కేవలం 10 రోజులు మాత్రమే. ఇది జూన్ నుండి ఆగస్టు చివరి వరకు అడవులలో కనిపిస్తుంది. ఇది గుడ్లు పెట్టినప్పుడు, దాని నుంచి పిల్లలు బయటకు రావడానికి రెండు వారాలు పడుతుంది. ప్యూపా నుండి సీతాకోకచిలుకగా మారడానికి 21 రోజులు పడుతుంది. ఇది పూర్తి సీతాకోకచిలుకగా మారినప్పుడు 10 రోజులు జీవిస్తుంది. ఇది గతంలో జార్ఖండ్‌లోనూ కనిపించింది. ఈ సీతాకోకచిలుక కాంతి వైపు ఆకర్షితమవుతుంది. 

Updated Date - 2022-09-28T13:33:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising