ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రష్యా దండయాత్ర నేపథ్యంలో 80 ఏళ్ల వృద్ధుడు ఉక్రెయిన్ సైన్యంలో చేరిక

ABN, First Publish Date - 2022-02-26T16:01:44+05:30

ఉక్రెయిన్ దేశంపై రష్యా మిలటరీ దండయాత్ర నేపథ్యంలో 80 ఏళ్ల వృద్ధుడు ఉక్రేనియన్ సైన్యంలో చేరిన ఘటన సంచలనం...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కీవ్ : ఉక్రెయిన్ దేశంపై రష్యా మిలటరీ దండయాత్ర నేపథ్యంలో 80 ఏళ్ల వృద్ధుడు ఉక్రేనియన్ సైన్యంలో చేరిన ఘటన సంచలనం రేపింది.రష్యా దాడికి వ్యతిరేకంగా పోరాడేందుకు ఉక్రెయిన్ సైన్యంలో చేరేందుకు వచ్చిన 80 ఏళ్ల వృద్ధుడి ఫొటో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. హృదయాన్ని కదిలించే ఈ ఫొటోలో ఆక్టోజెనేరియన్ చిన్న బ్రీఫ్‌కేస్‌ను పట్టుకుని ఉక్రేనియన్ దళాల సిబ్బందితో నిలబడి ఉన్నాడు.2005 నుంచి 2010 వరకు ఉక్రెయిన్ ప్రథమ మహిళ కాటెరినా మైఖైలివ్నా యుష్చెంకో సైన్యంలో చేరిన వృద్ధుడి చిత్రాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. సైన్యంలో చేరడానికి వచ్చిన 80 ఏళ్ల వ్యక్తి తన వెంట రెండు టీషర్టులు, ఒక ప్యాంటు, టూత్ బ్రష్, కొన్ని శాండ్‌విచ్‌లతో పాటు భోజనం వెంట తీసుకువచ్చారు. 


తన మనవరాళ్ల కోసం తాను సైన్యంలో చేరానని వృద్ధుడు చెప్పారు.ఈ ఫొటోకు 2.48 లక్షలకు పైగా నెటిజన్ల నుంచి లైక్‌లు వచ్చాయి. మరో 39వేల మంది నెటిజన్లు ఈ చిత్రాన్ని షేర్ చేశారు.ఆక్రమణదారులను తిప్పికొట్టడానికి పెట్రోల్ బాంబులను తయారు చేయమని కైవ్ నివాసితులకు ఉక్రేనియన్ రక్షణ మంత్రిత్వ శాఖ కోరింది. ఫిరంగి గుండ్ల మోత, భారీ కాల్పులు వినిపించినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. శనివారం తెల్లవారుజామున ఫిరంగి కాల్పుల శబ్దం వినిపించింది.కాగా ఇప్పటి వరకు యుద్ధంలో 1000 మందికి పైగా రష్యా సైనికులు హతమయ్యారని ఉక్రెయిన్ ప్రకటించింది. అయితే రష్యా మృతుల గణాంకాలను విడుదల చేయలేదు.


Updated Date - 2022-02-26T16:01:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising