ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ స్థలాన్ని అపవిత్రం చేస్తావా అంటూ.. ఆర్టిస్ట్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు

ABN, First Publish Date - 2022-01-30T21:46:08+05:30

రష్యా ఆర్టిస్ట్ తన సోషల్ మీడియా అకౌంట్లలో కొద్ది రోజుల క్రితం పెట్టిన కొన్ని ఫొటోలు చర్చనీయాంశం అయ్యాయి. ఆ ఫొటోలు పోలీసుల దృష్టికి వెళ్లడంతో అధికారులు అతడిపై కేసు నమోదు చేశారు. నేరం రుజువై

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: రష్యా ఆర్టిస్ట్ తన సోషల్ మీడియా అకౌంట్లలో కొద్ది రోజుల క్రితం పెట్టిన కొన్ని ఫొటోలు చర్చనీయాంశం అయ్యాయి. ఆ ఫొటోలు పోలీసుల దృష్టికి వెళ్లడంతో అధికారులు అతడిపై కేసు నమోదు చేశారు. నేరం రుజువైతే కోర్టు అతడికి ఐదేళ్ల జైలు శిక్ష లేదా భారీ మొత్తలో ఫైన్ విధించనుంది. కాగా.. ఆ ఆర్టిస్ట్ ఎవరు? ఆయన చేసిన తప్పేంటి అనే పూర్తి వివరాల్లోకి వెళితే..



ఆర్టిస్ట్ ఇవాన్ వోల్కోవ్.. సెయింట్ పీటర్‌బర్గ్ ప్రాంతంలో మంచుతో మలం ఆకారంలో 5 మీటర్ల శిల్పాన్ని రూపొందిచాడు. అనంతరం ఆ మంచు శిల్పాన్ని ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అదికాస్తా నెట్టింట వైరల్ కావడంతో పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో 1917 రష్యా విప్లవంలో మరణించిన వారిని  ఖననం చేసిన ప్రాంతాన్ని అపవిత్రం చేస్తావా అంటూ పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసుపై కోర్టు విచారణ జరుపుతోంది. నేరం రుజువైతే.. ఐదేళ్లపాటు ఇవాన్ వోల్కోవ్ జైల్లో గడపాల్సి ఉంటుంది. లేదంటే భారీ మొత్తంలో జరిమానా అయినా చెల్లించాల్సి ఉంటుంది. 




Updated Date - 2022-01-30T21:46:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising