ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సెలూన్‌లో హెయిర్ ట్రీట్‌మెంట్ కోసం వెళ్లిన ఆఫీసర్ భార్య.. మరుసటి రోజు ఆమె జుట్టుకు ఏమైందంటే..

ABN, First Publish Date - 2022-05-22T05:52:00+05:30

అమ్మాయిలైనా అబ్బాయిలైనా తమ జుట్టు అందంగా మారాలంటే సెలూన్ మెట్లు ఎక్కాల్సిందే. కానీ మనం వెళ్లే సెలూన్‌ ఎలాంటిదో ముందుగానే తెలుసుకోవాలి. లేదంటే ఒక్కోసారి కొన్ని ప్రమాదాలు జరుగుతుంటాయి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమ్మాయిలైనా అబ్బాయిలైనా తమ జుట్టు అందంగా మారాలంటే సెలూన్ మెట్లు ఎక్కాల్సిందే. కానీ మనం వెళ్లే సెలూన్‌ ఎలాంటిదో ముందుగానే తెలుసుకోవాలి. లేదంటే ఒక్కోసారి కొన్ని ప్రమాదాలు జరుగుతుంటాయి. సరిగ్గా ఇలాంటి ఘటనే మధ్యప్రదేశ్ రాజధాని ఇండోర్‌లో జరిగింది. 


ఒక ఆర్మీ ఆఫీసర్ భార్య.. స్థానికంగా కొంచెం పేరున్న ఒక సెలూన్‌కు వెళ్లింది. అక్కడ హెయిర్ ట్రీట్‌మెంట్ తర్వాత ఆమె జుట్టు కాలిపోయిందట. దీంతో ఆగ్రహం తెచ్చుకున్న ఆమె.. పోలీసులను ఆశ్రయించింది. సదరు సెలూన్‌లో కొన్ని వాడకూడని కెమికల్స్ వాడారని, దాంతో తన జుట్టు కాలిపోయిందని ఫిర్యాదు చేసింది. 


కంప్లయింట్ రిజిస్టర్ చేసుకున్న పోలీసులు.. సదరు సెలూన్ సూపర్‌వైజర్ శుభమ్ గుప్తా, మేనేజర్ భావనా విజయ్ తలరేజా, ఉద్యోగి రాజ్‌కుమార్ ప్రకాశ్‌సింహ్ ముగ్గురిపై కేసు నమోదు చేసుకున్నారు. కేసు విచారణలో ఉందని అధికారులు చెప్పారు. అయితే ఈ ఫిర్యాదుకు సంబంధించి ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదని తెలిసింది.

Updated Date - 2022-05-22T05:52:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising