ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మెక్సికోలో బ‌య‌ట‌ప‌డిన‌ 1,500 ఏళ్ల నాటి నగరం.. పురావ‌స్తు శాస్త్రవేత్తల త‌వ్వ‌కాల్లో బ‌య‌ట‌ప‌డిన రాజభవనాలు, పిరమిడ్‌లు

ABN, First Publish Date - 2022-05-29T18:01:48+05:30

మెక్సికోలోని యుకాటాన్ ప్రాంతంలో 1,500 ఏళ్ల నాటి మాయన్ నగర అవశేషాలను పురావస్తు శాస్త్రవేత్తలు వెలికి తీశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మెక్సికోలోని యుకాటాన్ ప్రాంతంలో 1,500 ఏళ్ల నాటి మాయన్ నగర అవశేషాలను పురావస్తు శాస్త్రవేత్తలు వెలికి తీశారు. ఈ న‌గరంలో క్రీ.శ‌. 600 మరియు 900 మధ్య దాదాపు 4,000 మంది ప్రజలు నివసించారని శాస్త్ర‌వేత్త‌లు భావిస్తున్నారు. యుకాటాన్ ఉత్తర తీరంలో ఉన్న‌ మెరిడా పట్టణానికి సమీపంలో ఇండ‌స్ట్రియ‌ల్ పార్కు నిర్మాణ కోసం త‌వ్వ‌కాలు జ‌రుపుతున్న‌ప్పుడు 2018లో ఈ ప్రాంతం మొదటిసారిగా వెలుగులోకి వ‌చ్చింది. 


 ఆ స్థలాన్ని  నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఆంత్రోపాలజీ అండ్ హిస్టరీకి చెందిన పురావస్తు శాస్త్రవేత్తలు స్వాధీనం చేసుకుని త‌వ్వ‌కాలు ప్రారంభించారు. త‌వ్వకాల‌లో భారీ రాజ‌భ‌వ‌నాలు, పిర‌మిడ్ ల అవశేషాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. ఆ ప్రాంతంలో దాదాపు 1500 ఏళ్ల క్రితం వివిధ సామాజిక వ‌ర్గాల‌కు చెందిన 4 వేల మంది ప్ర‌జ‌లు నివ‌సించిన‌ట్టు ప‌రిశోధకులు తెలిపారు. ప్యూక్ స్టైల్ ఆర్కిటెక్చర్ లో నిర్మించిన పిర‌మిడ్ లు, భారీ రాజ‌భ‌వ‌నాలు వెలుగులోకి వ‌చ్చాయి. మ‌రింత ప‌రిశోధ‌న అనంత‌రం మొత్తం విష‌యాలు వెల్ల‌డిస్తామ‌ని శాస్త్ర‌వేత్త‌లు తెలిపారు. 


Updated Date - 2022-05-29T18:01:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising