ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉద్యోగులకు బూస్టర్ డోసు తప్పనిసరి చేసిన ఆ సంస్థ.. లేదంటే ప్రతిరోజు ఇబ్బందులే.. అదెలాగంటే..

ABN, First Publish Date - 2022-01-17T08:26:13+05:30

తమ సంస్థలో పనిచేసే ఉద్యోగులు తప్పనిసరిగా కొవిడ్ బూస్టర్ డోస్ వేయించుకోవాలని నిబంధన పెట్టింది అమెరికా టెక్నాలజీ దిగ్గజం...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తమ సంస్థలో పనిచేసే ఉద్యోగులు తప్పనిసరిగా కొవిడ్ బూస్టర్ డోస్ వేయించుకోవాలని నిబంధన పెట్టింది అమెరికా టెక్నాలజీ దిగ్గజం 'యాపిల్'. బూస్టర్ డోస్ తీసుకున్నట్టు ప్రూఫ్ కోసం మూడు డోసుల వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ చూపిస్తేనే ఉద్యోగులకు ఆఫిస్‌లో ఎంట్రీ ఉంటుందని  యాపిల్ యజమాన్యం శనివారం అధికారికంగా స్పష్టం చేసింది. 


‘కొవిడ్-19 వ్యాక్సిన్ ప్రాథమిక సామర్థ్యంతో పాటు ఒమిక్రాన్ వ్యాప్తిని అడ్డుకోవాలంటే బూస్టర్ షాట్ తీసుకోవాలని.. దాని వల్ల పలు తీవ్రమైన జబ్బుల నుంచి రక్షణ లభిస్తుందని సంస్థ ప్రకటనలో తెలిపింది . 


బూస్టర్ డోసు తీసుకోని వారు ఆఫీసుకు రావాలంటే ప్రతి రోజు కరోనా నెగిటివ్ టెస్ట్ రిపోర్ట్ చూపించాలని షరతు కూడా విధించింది. దీంతో కరోనా మూడో డోసు తీసుకోని యాపిల్ ఉద్యోగులకు ఆఫీస్ వెళ్లాలంటే ఇబ్బందలు తప్పవు. 

అమెరికాలోని చాలా కంపెనీలు కొవిడ్-19 రూల్స్‌ని కఠినతరం చేస్తూ.. వ్యాక్సినేషన్ తప్పనిసరి చేశాయి. కానీ ఒమిక్రాన్ వల్ల ఇన్ఫెక్షన్లు వేగంగా వ్యాప్తి చెందుతున్న తరుణంలో వర్క ఫ్రం హోమ్ ప్రక్రియని మార్చి చివరి వరకు పొడిగించాయి. యాపిల్ కంటే ముందు మెటా(ఫేస్‌బుక్) సంస్థ తమ ఉద్యోగులకు బూస్టర్ డోసు తప్పనిసరి చేసింది.. కానీ ఆ తరువాత తన నిర్ణయాన్ని వెనక్కుతీసుకుంది. 


Updated Date - 2022-01-17T08:26:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising