ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Annoyed By Parrot : రామచిలుక అరుపులు, చప్పుళ్లు తట్టుకోలేక కేసు పెట్టాడు..

ABN, First Publish Date - 2022-08-08T02:16:18+05:30

ఓ 72 ఏళ్ల పెద్దాయనకు పక్కింటివారి రామచిలుక తెగ చిరాకు తెప్పించింది. అరుపులు, రెక్కల చప్పుళ్లు వేగలేక ఏకంగా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన ఘటన మహారాష్ట్రలోని పుణెలో వెలుగుచూసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పుణె : ఓ 72 ఏళ్ల పెద్దాయనకు పక్కింటివారి రామచిలుక(Parrot) తెగ చిరాకు తెప్పించింది. అరుపులు, రెక్కల చప్పుళ్లు వేగలేక ఏకంగా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన ఘటన మహారాష్ట్ర(Maharastra)లోని పుణె(Pune)లో వెలుగుచూసింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. పొరుగింటి అక్బర్ అంజాద్ ఖాన్‌ పెంచుకుంటున్నట్టు చిలుక నిరంతరం అరుపులు, చప్పుళ్లతో తనను తెగ ఇబ్బందిపెడుతోందంటూ ఖాడ్కీ పోలీస్ స్టేషన్‌లో 72 ఏళ్ల సురేష్ షిండే ఫిర్యాదు చేశాడు. చిలుక కారణంగా తాను కలవరానికి గురవుతున్నట్టు ఫిర్యాదులో సురేష్ షిండే వాపోయాడు. పుణె నగరంలోని శివాజీనగర్‌లో వీళ్ల హౌసింగ్ కాంప్లెక్స్ ఉందని స్టేషన్ అధికారి వివరించారు.


కాగా నాన్-కాగ్నిజబుల్ ఆఫెన్స్‌గా పరిగణలోకి తీసుకున్నట్టు పోలీసులు చెప్పారు. అంటే షిండే ఫిర్యాదు ఆధారంగా చిలుక యజమానిని అరెస్ట్ చేయడం సాధ్యపడదు. ఈ వ్యవహారాన్ని న్యాయస్థానం పరిధిలో తేల్చుకోవాల్సి ఉంటుందని ఖడ్కీ పోలీస్ స్టేషన్ అధికారి చెప్పారు. ఈ కేసులో నిబంధనల ప్రకారం ముందుకెళ్తామని వివరించారు.

Updated Date - 2022-08-08T02:16:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising