ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పీటలపై ఆగిన పెళ్లి...పెళ్లికి నో చెప్పిన వధువు

ABN, First Publish Date - 2022-01-28T17:58:43+05:30

వివాహ వేడుకలో వరుడు చేసిన చిన్న పొరపాటు వల్ల తాను అతన్ని పెళ్లి చేసుకోనని వధువు తెగేసి చెప్పిన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం రేపింది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వరుడు పూలదండ విసిరేశాడనే కోపంతో పెళ్లికి నిరాకరించిన వధువు

లక్నో (ఉత్తరప్రదేశ్): వివాహ వేడుకలో వరుడు చేసిన చిన్న పొరపాటు వల్ల తాను అతన్ని పెళ్లి చేసుకోనని వధువు తెగేసి చెప్పిన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం రేపింది. వరమాల వేడుకలో వరుడు పూలదండ విసిరివేయడంతో వధువు ఆగ్రహం వ్యక్తం చేసిన ఘటన  ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఔరయ్యా జిల్లాలోని బిదునా కొత్వాలి పట్టణం నవీన్ బస్తీలో వెలుగుచూసింది. ఔరయ్యా జిల్లాకు చెందిన వధూవరులు పెళ్లి చేసుకునేందుకు పెళ్లి పందిరి వద్దకు వచ్చారు. సంప్రదాయ బద్ధంగా జరగాల్సిన వరమాల వేడుకలో వరుడు పూలదండను విసిరివేశాడు. అంతే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన వధువు వరుడిని పెళ్లాడేందుకు నిరాకరించింది.పెళ్లికూతురి నిర్ణయంతో పెళ్లికి వచ్చిన అతిథులు షాక్ కు గురయ్యారు.


 ఈ ఘటనతో ఇరు కుటుంబాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.పెళ్లికి వధువును ఒప్పించేందుకు పెళ్లి పెద్దలు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి.ఈ ఘటన జరిగినపుడు వరుడి కుటుంబీకులు భోజనం చేసేందుకు పెళ్లి పందిరి వద్ద నుంచి బయటకు వెళ్లారు. కాగా తాను పూలదండను విసిరి కొట్టలేదని వరుడు ఆకాష్ వివరణ ఇచ్చినా, పెళ్లి చేసుకునేందుకు మాత్రం వధువు ససేమిరా అని చెప్పేసింది. దీంతో పెళ్లి వేడుక కాస్తా ఆగిపోయింది.


Updated Date - 2022-01-28T17:58:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising