ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తల్లిదండ్రులు మందలించారని పారిపోయిన కుర్రాడు.. జేబులో రుపాయి కూడా లేకుండా 838 కి.మి ప్రయాణం.. చివరకు..

ABN, First Publish Date - 2022-04-23T19:12:20+05:30

ఆ కుర్రాడి వయసు 15 ఏళ్లు.. పదో తరగతి చదువుతున్నాడు.. పరీక్షలకు సరిగ్గా చదవడం లేదనే కారణంతో తల్లిదండ్రులు ఆ కుర్రాడిని మందలించారు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆ కుర్రాడి వయసు 15 ఏళ్లు.. పదో తరగతి చదువుతున్నాడు.. పరీక్షలకు సరిగ్గా చదవడం లేదనే కారణంతో తల్లిదండ్రులు ఆ కుర్రాడిని మందలించారు.. దీంతో అలిగిన ఆ కుర్రాడు ఇంటి నుంచి పారిపోయాడు.. జేబులో రూపాయి లేకపోయినా నేరుగా రైల్వే స్టేషన్‌కు వెళ్లి రైలెక్కేశాడు.. నాగౌర్ నుంచి జైపూర్, అక్కిడి నుంచి ఆగ్రా వరకు వెళ్లిపోయాడు.. మూడ్రోజుల పాటు ఆహారం లేకుండా గడిపాడు.. చివరకు చైల్డ్ హెల్ప్ లైన్ ప్రతినిధుల సహకారంతో ఇంటికి చేరుకున్నాడు. 


రాజస్థాన్‌లోని నాగౌర్‌లో సవాయ్ మాధోపూర్‌కు చెందిన 15 ఏళ్ల కుర్రాడు తల్లిదండ్రులు మందలించారనే కారణంతో ఈ నెల 19న ఇంటి నుంచి పారిపోయాడు. జేబులో రూపాయి కూడా లేకుండా రైలెక్కేసి జైపూర్ చేరుకున్నాడు. మరుసటి రోజు అక్కడి నుంచి ఆగ్రా రైలు ఎక్కి ఆగ్రా చేరుకున్నాడు. అక్కడ తాజ్ మహల్ చూశాడు. రోజంతా అక్కడ తిరిగి మళ్లీ జైపూర్ వెళ్లే రైలెక్కాడు. ఆ రైలులో టీటీఈకి దొరికిపోయాడు. అతను ఆ కుర్రాడిని ఆర్పీఎఫ్ సిబ్బందికి అప్పగించాడు. 


ఆర్పీఎఫ్ సిబ్బంది జైపూర్ చైల్డ్ హెల్ప్ లైన్ ప్రతినిధులకు సమాచారం అందించారు. మూడ్రోజులు ఆహారం లేకపోవడంతో నీరసించిపోయిన ఆ కుర్రాడిని చైల్డ్ హెల్ప్ లైన్ ప్రతినిధులు జువైనల్ హోమ్‌కు తీసుకెళ్లారు. అక్కడ అతడికి  భోజనం పెట్టారు. అనంతరం అతడి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. సమాచారం అందుకుని తమను సంప్రదించిన తల్లిదండ్రులకు ఆ కుర్రాడిని అప్పగించారు. 

Updated Date - 2022-04-23T19:12:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising